వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు ఉద్రిక్తత: తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను రంగంలోకి దించిన ఐఏఎఫ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిఘాను పెంచుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన రెండు లైట్ కొంబాట్ హెలికాప్టర్(తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు)లను సరిహద్దులో దించింది. సరిహద్దులో చైనా కుట్రలపై ఈ హెలికాప్టర్లు నిఘా పెట్టనున్నాయి.

Recommended Video

#IndoChinastandoff : HAL Light Combat Helicopters Deployed In Ladakh || Oneindia Telugu

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిషన్స్‌కు ఈ శక్తివంతమైన హెలికాప్టర్లు అండగా నిలవనున్నాయి. హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ బుధవారం మాట్లాడుతూ.. ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా భారత భద్రతా దళాల అవసరాల మేరకు ఈ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ రూపొందించిందని వివరించారు.

ఇటీవలే వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా.. హెఏఎల్ టెస్ట్ పైలట్, వింగ్ కమాండర్(రిటైర్డ్) సుభాష్ పీ జాన్‌తో కలిసి ఎత్తైన ప్రాంతం నుంచి ఈ హెలిక్టాప్టర్‌లో ప్రయాణించారు. ఎత్తైన ప్రాంతాల నుంచి ఈ హెలికాప్టర్లు సమర్థవంతంగా దాడులు చేయగలవు.

IAF deploys two HAL-developed Light Combat Helicopters in Leh amid border tensions

ఈ హెలికాప్టర్లు అత్యంత ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తాయి. అంతేగాక, అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా ఈ హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ కాగలవు. అంతేగాక, పగటి పూటనే కాకుండా రాత్రివేళలో కూడా ఈ శక్తివంతమైన హెలికాప్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఆయుధాలతో దాడులు చేయగలవు.

కాగా, ఐఏఎఫ్, ఇండియన్ ఆర్మీకి సంయుక్తంగా 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల అవసరం ఉంది. ఈ క్రమంలో 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల ప్రారంభ బ్యాచ్ ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. పర్యవసానంగా, 15 పరిమిత సిరీస్ ప్రొడక్షన్ (ఎల్‌ఎస్‌పి) హెలికాప్టర్లకు (ఐఎఎఫ్‌కు 10, ఆర్మీకి 5) ఐఎఎఫ్ ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పి) జారీ చేసింది. ఇప్పటికే బెంగళూరులోని సంస్థ ఉత్పత్తిని ప్రారంభించింది.

మేలో ఐఏఎఫ్ సులూర్ వద్ద తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) రెండవ పోరాట స్క్వాడ్రన్‌ను అమలు చేసింది.42 స్క్వాడ్రన్లు అవసరం ఉండగా ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 42 మాత్రమే ఉన్నాయి.

English summary
In the light of border tensions, two Light Combat Helicopters developed by Hindustan Aeronautics Limited (HAL) have been deployed for operations at high altitude in Leh to support Indian Air Force missions. The operational requirement was met in a short notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X