వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతమంది టెర్రరిస్ట్‌లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సర్జికల్ స్ట్రైక్స్ 2 (ఎయిర్ స్ట్రైక్స్)పై ఆధారాలు కావాలని విపక్షాలు పదేపదే అవమానించేలా మాట్లాడుతున్నాయి. ఈ దాడి వల్ల తీవ్రవాదులు ఎవరూ చనిపోలేదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయని కాంగ్రెస్ చెబుతోంది.

<strong>భారత పైలట్ల దెబ్బ, అమెరికా లక్షలకోట్ల డీల్‌పై ప్రభావం! పాక్ ఎఫ్ 16 ఉపయోగంపై పెద్దన్న ఆందోళన</strong>భారత పైలట్ల దెబ్బ, అమెరికా లక్షలకోట్ల డీల్‌పై ప్రభావం! పాక్ ఎఫ్ 16 ఉపయోగంపై పెద్దన్న ఆందోళన

మిగ్ 21 బైసన్ విమానంపై ఎయిర్ చీఫ్ మార్షల్

ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం మంచి సామర్థ్యం కలిగిన ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పారు. ఇది అప్ గ్రేడ్ చేయబడిందన్నారు. ఇది మంచి రాడార్ వ్యవస్థను, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌ను, మంచి ఆయుధ వ్యవస్థ కలిగి ఉందని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించారు

లక్ష్యాలను క్లియర్‌గా నిర్దేషించుకున్నామని తెలిపారు. మేం మా లక్ష్యాలను చేరుకోకుంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడని ప్రశ్నించారు. మేం వారికి సంబంధం లేని అడవుల్లో బాంబులు జారవిడిస్తే పాక్ ప్రధాని ఎలా స్పందింస్తాడో చెప్పాలన్నారు. తాము తమ టార్గెట్‌ను పూర్తి చేశామని చెప్పారు.

ఎంతమంది చనిపోయారో ఎయిర్ ఫోర్స్ లెక్కించదు

ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే విషయం ఎయిర్ పోర్స్ లెక్కించలేదని, ప్రభుత్వం ఆ పని చేస్తుందని తెలిపారు. ఈ దాడిలో ఎంతమంది తీవ్రవాదులు మృతి చెందారనే అంశంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెక్కించమని, ఆ లెక్క ప్రభుత్వం చెబుతుందన్నారు. తమ దాడిలో ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారనే విషయం పక్కన పెడితే, తాము టార్గెట్‌ను (ఉగ్రవాద శిబిరాల ధ్వంసం) చేధించామా లేదా అనేది తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని అభిప్రాయపడ్డారు.

విరోధి దాడి చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఏది అనే సంబంధం లేదు

అత్యాధునిక పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని మన మిగ్ 21 సమర్థవంతంగా ఢీకొట్టిందనే అంశంపై కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా స్పందించారు. ఎవరైనా ఆపరేషన్ ప్లాన్ చేస్తే, ఓ ప్రణాళిక ప్రకారం ఉంటుందని, అప్పుడు పరిస్థితి ఒకలా ఉంటుందని చెప్పారు. కానీ మనపై విరోధి దాడి చేసిన సమయంలో మనకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతామని, అది ఏ ఎయిర్ క్రాఫ్ట్ అనేది సంబంధం లేకుండా ఢీకొనేందుకు సిద్ధమవుతామని చెప్పారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా సమర్థవంతమైనదేనని వ్యాఖ్యానించారు.

English summary
IAF chief Air Chief Marshal BS Dhanoa said Monday that the "death toll depends on the number of people present in target", and the "IAF doesn't count number of dead" and the "casualty figure in air strike on Balakot camp will be given by government," referring to the air strike on February 26, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X