వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సరిహద్దు వైపు పాక్ యుద్ధ విమానాలు...తరిమికొట్టిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..?

|
Google Oneindia TeluguNews

పంజాబ్ : పాకిస్తాన్ మళ్లీ భారత్‌పై దాడి చేసేందుకు తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపిందా.... పంజాబ్ సరిహద్దుల్లో కనిపించిన యుద్ధవిమానాలు పాకిస్తాన్‌కు చెందినవేనా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు పంజాబ్ సరిహద్దుల్లోని గగనతలంలో కనిపించినట్లు సమచారం. ఇది గమనించిన భారత దళాలు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది.

IAF fighter jets scrambled last night after Pakistan F-16s flew close to border

భారత గగనతలంలోకి రావాలనే ఉద్దేశం పాక్‌కు ఏమైనా ఉందా అనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఆ యుద్ధ విమానాలు భారత్ పాక్ సరిహద్దులకు దగ్గరగా ఎగిరినట్లు సమాచారం. అంతేకాదు వీటిపై సర్వేలియన్స్ డ్రోన్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో సైన్యం మోహరింపును స్టడీ చేసేందుకు బహుషా డ్రోన్‌లను వేసుకుని యుద్ధ విమానాలు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. సరిహద్దు వైపు పాక్ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు రాడార్ పసిగట్టగానే వెంటనే భారత వాయుసేనకు సంబంధించిన సుఖోయ్ ఎస్‌యూ-30 మిరాజ్-2000 యుద్ధవిమానాలు అలర్ట్ అయ్యాయి.

ఆర్జేడీలో చీలిక: కొత్త పార్టీ వైపు లాలూ పెద్ద కుమారుడి అడుగులు..?ఆర్జేడీలో చీలిక: కొత్త పార్టీ వైపు లాలూ పెద్ద కుమారుడి అడుగులు..?

ఫిబ్రవరి 14న పుల్వామా దాడులు జరిగిన తర్వాత దాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగా భారత వైమానిక దళం బాలాకోట్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాకిస్తాన్ కూడా భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయగా భారతవాయుసేన తిప్పికొట్టింది. ఆ సమయంలోనే ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోవడం అందులోని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్‌కు పట్టుబడటం జరిగింది. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అయితే అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయడంతో పరిస్థితులు కాస్త శాంతించాయి. ఇక అప్పటి నుంచి సరిహద్దుల్లో త్రివిధ దళాలు చాలా అలర్ట్‌గా ఉన్నాయి.

English summary
The Indian Air Force scrambled its top fighter jets to intercept four Pakistani fighter jets that were flying close to the international border near Punjab, sources told.It's unclear if the Pakistani jets were trying to intrude into Indian airspace, with sources saying that the Pakistani fighters were flying with a surveillance drone with the possible aim of detecting Indian troop deployment near the border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X