వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

625 టన్నుల నోట్లు, 20 కేజీలో బ్యాగులో రూ.కోటి, వాయుసేన విమానాల్లో రవాణా..

|
Google Oneindia TeluguNews

2016 నవంబర్‌ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను రద్దుచేస్తున్నామని ప్రకటించింది. పాత రూ.500, రూ.1000 నోట్లకు నిర్ణీత సమయం ఇచ్చి, మార్చుకోవాలని సూచించింది. వెంటనే రూ.2 వేల నోటు, తర్వాత రూ.500 నోట్లను కూడా ముద్రించింది. అయితే 130 కోట్ల మంది ఉన్న దేశంలో కొత్త నోట్లను తీసుకొచ్చింది ఎవరు ? ఎలా అందజేశారు ? అనే ప్రశ్నకు మాజీ వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా క్లారిటీ ఇచ్చారు.

విమానాల ద్వారా..

విమానాల ద్వారా..

పెద్ద నోట్ల రద్దు తర్వాత వాయుసేన విమానాల ద్వారా దేశంలోని అన్నీ ప్రాంతాలకు నగదును తరలించినట్టు పేర్కొన్నారు. 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను వివిధ ప్రాంతాలకు రవాణా చేసినట్టు వివరించారు. 20 కేజీలో బ్యాగులో రూ. కోటి నగదు పట్టేదని.. 625 టన్నుల నగదును తరలిస్తే ఎంత అవుతుందో మీరే లెక్కించుకొండి అని చెప్పారు. శనివారం ముంబై ఐఐటీలో జరిగిన ‘టెక్‌ఫెస్ట్' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

625 టన్నుల నోట్లు

625 టన్నుల నోట్లు

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో అంతర్గత సేవల్లో భాగంగా కొత్త నోట్లను వివిధ ప్రాంతాలకు భారత వాయుసేన తరలించింది. 625 టన్నుల నగదును 33 మిషన్ల ద్వారా పంపించినట్టు ధనోవా పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదును ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు పంపించింది. కానీ ఎలా వచ్చిందనే అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. కానీ ధనోవా తాజాగా రిలీవ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 డిసెంబర్ 31 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు భారత వాయుసేన అధిపతిగా ధనోవా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

సామర్థ్యం..

సామర్థ్యం..

రాఫెల్ ఒప్పందం కొనుగోలు గురించి తప్పుగా మాట్లాడటంతో రక్షణరంగానికి మంచిది కాదని సూచించారు. ఇదే అన్నింటికీ వర్తిస్తోందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణం గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించారు.

కూలేది కాదు..

కూలేది కాదు..

గతేడాది బాలాకోట్ దాడి జరిగిన తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్ 21 బదులు రాఫెల్ విమానం వాడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని బీఎస్ ధనోవా పేర్కొన్నారు.

English summary
former Air Chief Marshal BS Dhanoa has said that after demonetisation in 2016, the IAF transported 625 tonnes of new currency notes to various parts of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X