వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 8 అమెరికా అపాచీ చాపర్లు..వీటి ప్రత్యేకత ఏంటంటే..?

|
Google Oneindia TeluguNews

భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యింది. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లు భారత వాయు సేనలో చేరాయి. దీంతో యుద్ధం జరిగే సమయంలో కీలకంగా వ్యవహరించే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత బలోపేతం అయ్యింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ఈ హెలికాఫ్టర్లకు వాటర్ కేనన్ సెల్యూట్ లభించింది. అంతేకాదు ఈ హెలికాఫ్టర్లకు పూజలు కూడా నిర్వహించారు.

అపాచీ ఏహెచ్ -64ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకతలు

అపాచీ ఏహెచ్ -64ఈ హెలికాఫ్టర్ వివరాల్లోకి వెళితే... ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ అటాకింగ్ చాపర్స్‌లో ఈ చాపర్ ప్రథమ స్థానంలో ఉంది. ఎన్నో మిషన్లను పూర్తి చేయగల సామర్థ్యం ఈ చాపర్లకు ఉంది. ఈ రోజు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ఏహెచ్ - 64 ఈ అటాకింగ్ హెలికాఫ్టర్‌లు చేరడంతో అటాకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అయినట్లయ్యిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ దనోవా చెప్పారు. 2015లో అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో ఏహెచ్ - 64 ఈ హెలికాఫ్టర్ల కొనుగోలుకు భారత్ కొన్ని బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. 22 చాపర్లను కొనుగోలు చేయాలని భారత్ భావించింది. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఈ చాపర్లు కలిగి ఉన్నాయి.

<strong>చంద్రయాన్-2 మరో కీలక ఘట్టం విజయవంతం: చంద్రుని కక్ష్యలోకి విక్రమ్ ల్యాండర్</strong> చంద్రయాన్-2 మరో కీలక ఘట్టం విజయవంతం: చంద్రుని కక్ష్యలోకి విక్రమ్ ల్యాండర్

క్షిపణి వ్యవస్థ, క్యానన్ గన్లు ప్రత్యేకం

ఇక ఏహెచ్ - 64 ఈ హెలికాఫ్టర్లు క్షిపణులు, రాకెట్లను మోసుకెళ్లగలవు. ఒక్కో హెలికాఫ్టర్ 8 క్షిపణులను మోసుకెల్లే సామర్థ్యం ఉంది. ఇక ఇందులో క్యానన్ గన్‌లు కూడా ఏర్పాటు చేశారు ఒకేసారి 12వేల రౌండ్ల కాల్పులు జరపొచ్చు. అంతేకాదు క్షిపణులను మోసుకెళ్లేందుకు రెండు మిస్సైల్ ప్యాడ్లు ఉన్నాయి.ఒక్కోదానిలో 19 క్షిపణులను ఫిక్స్ చేయొచ్చు. ఇంతకాలం భారత వైమానిక దళంలో సేవలందించిన రష్యాకు చెందిన ఎమ్ఐ-35 చాపర్లకు భారత్ స్వస్తి పలకనుంది. ఇక వాటి సర్వీసు కాలం ముగియనుండటంతో భారత్ కొత్త ఏహెచ్ - 64 ఈ చాపర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకొచ్చింది.

తక్కువ ఎత్తులో ఎగురుతూనే లక్ష్యాలను చేధించగలవు

ఏహెచ్ - 64 ఈ చాపర్లు శతృవులు గుర్తించకుండా తక్కువ ఎత్తులో ఎగురుతుండగానే లక్ష్యాలను చేధించగల సాంకేతికత వ్యవస్థ ఇందులో ఉంది. అంతేకాదు ఇందులో ఉన్న వెపన్ సిస్టం ద్వారా యుద్ధం జరిగే సమయంలో ఆ యుద్ధానికి సంబంధించిన వీడియోలను రిసీవ్ చేసుకోవడం లేదా ట్రాన్స్‌మిట్ చేయగల సామర్థ్యం ఉంది. ఇదంతా ఆ చాపర్లలో అమర్చి ఉన్న డేటా నెట్‌వర్క్‌ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. అపాచీ ఏహెచ్-64ఈ చాపర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు జూలై 2018లో తొలిసారిగా నడిపారు. గతేడాది ఈ చాపర్లను నడిపేందుకు భారత వాయుసేనలోని పైలట్లకు అమెరికాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది.

అపాచీ చాపర్లను వినియోగిస్తున్న దేశాలు ఇవే..!

అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్ల తయారీ హెడ్‌క్వార్టర్స్ అమెరికాలో ఉంది. అయితే ఈ తరహా హెలికాఫ్టర్లను గ్రీస్, జపాన్, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, సింగపూర్, యూఏఈలాంటి దేశాలు కూడా తమ రక్షణ వ్యవస్థల్లో వినియోగిస్తున్నాయి. యూకేలో ప్రత్యేకంగా తయారు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ అపాచీ పేరుతో ప్రత్యేకంగా ఈ సంస్థ లైసెన్స్ పొందింది. ఇక అపాచీ ఏహెచ్-64ఈ చాపర్లు పనామా, పర్షియన్ గల్ఫ్, కొసావో, అఫ్ఘానిస్తాన్ , ఇరాక్ దేశాల్లో మిలటరీ పరమైన సమస్యలు తలెత్తినప్పుడు వినియోగించారు. ఇక లైబానన్ గాజా స్ట్రిప్‌లపై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ సైన్యం అపాచీ ఏహెచ్-64ఈ చాపర్లను వినియోగించింది. అఫ్గానిస్తాన్ ఇరాక్‌లలో యుద్ధం తలెత్తినప్పుడు యూకే, డచ్ దేశాలకు చెందిన అపాచీ ఏహెచ్-64ఈ చాపర్లను అక్కడ మోహరించాయి.


మొత్తానికి అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లు భారత వాయుసేనలో చేరడంతో ఐఏఎఫ్ మరింత బలోపేతం అయ్యింది. అదికూడా భారత్ పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ఈ చాపర్ల చేరికతో లక్ష్యాలను మరింత సులభతరంగా చేధించవచ్చనే భావనలో భారత రక్షణశాఖ ఉంది.

English summary
Eight US made Apache AH-64E attack helicopters joined the Indian Air Force (IAF) fleet today in Pathankot, in a major boost to India's combat capabilities. A priest performed rituals in front of a helicopter, which was also given a "water cannon salute" at the Pathankot Air Force base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X