వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది

|
Google Oneindia TeluguNews

అస్సోం: జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు విమాన శకలాలను అధికారులు కనుగొన్నారు. బుధవారం రోజున 10 మంది ఆర్మీ సిబ్బందిని శకలాలు గుర్తించిన ప్రాంతంలో దింపింది. ముందుగా ఏఎల్‌హెచ్ మరియు ఎమ్ఐ-17 చాపర్లలో సిబ్బంది శకలాలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత సిబ్బంది చిన్నగా ఆ కొండలోయలోకి దిగారు. ఇప్పటికే కొందరు శకలాలు ఉన్న చోటుకు చేరుకోగా మరికొందరు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు.

కేసులు, ఆరోపణలపై స్పందించిన కోడెల .. ఆరోపణలు కాదు ఒక్క ఆధారం చూపించండని సవాల్ <br>కేసులు, ఆరోపణలపై స్పందించిన కోడెల .. ఆరోపణలు కాదు ఒక్క ఆధారం చూపించండని సవాల్

ఇక ఆర్మీకి తోడు మరో 15 మంది పర్వతారోహకులను కూడా ఎమ్ఐ-17 ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్లు ప్రమాధ స్థలం వద్దకు చేర్చాయి. ఈ 15 మందిలో 9 మంది సిబ్బంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మౌంటెనీరింగ్ టీమ్‌కు చెందిన వారుకాగా నలుగురు ఆర్మీకి చెందినవారు మరో ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. విమానం లిపోకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. ఇక విమానం ఆచూకి కనుగొనేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17ను రంగంలోకి దించారు. ఇక బుధవారం ముగిసేలోగా విమానంలో ప్రయాణించిన వారి సమాచారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

IAF personnel reach the crash site of AN-32

అస్సోంలోని జోర్హత్ నేవల్ బేస్‌నుంచి మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో టేకాఫ్ తీసుకున్న ఏఎన్-32 విమానం గ్రౌండ్ సిబ్బందితో ఒంటిగంట సమయంలో సంబంధాలు తెగిపోయాయి. షియోమీ జిల్లాలోని మెచుకా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ స్టేషన్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 13 మంది ఉన్నారు. విమానం కూలిన చోటుకు చేరుకోవడం చాలా కష్టమైన పని అని అన్నారు సియాంగ్ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ టకుక్. అక్కడ ఎలాంటి సమాచార వ్యవస్థలు కానీ, మనుషులు నివసిస్తున్న దాఖలాలు కానీ లేవని తెలిపారు. అది పూర్తిగా కొండప్రాంతమని చెప్పారు.

English summary
8 to 10 personnel from the IAF had been dropped at the cras site of AN-32 aircraft which went missing.ALH and MI-17 choppers landed near the crash site, from where searchers will trek to the site where wreckage of the aircraft was discovered on Tuesday. Some have already reached the site, while others are still trekking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X