వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30వేల ఫీట్ల ఎత్తులోనే ఇంధనం నింపుకున్న రఫేల్ యుద్ధ విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియా ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అమ్ములపొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు మరికొద్ది గంటల్లో చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానాలు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చేరుున్నాయి.

ఈ నేపథ్యంలో 30వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. భారత్‌కు పయనమైన రఫేల్ విమానాలకు ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ చేసిన సహాయానికి అభినందనలు అంటూ ఆ ఫొటోలను ట్వీట్ చేసింది.

IAF Rafale jets get mid-air refueling at 30,000 feet

తొలి దశలో భాగంగా భారత్‌కు ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన మధ్యలో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) చెందిన అల్-దాఫ్రా వైమానిక స్థావరం వద్ద ఆగాయి.

తిరిగి అక్కడ నుంచి బయల్దేరిన విమానాలు బుధవారం భారత్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన ఆధునాతన సాంకేతికతను వీటికి అమర్చడంతో భారత రఫేల్ యుద్ధ విమానాలు మరింత శక్తివంతమయ్యాయి. అటు పాకిస్థాన్.. ఇటు చైనా దేశాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థకు ఈ యుద్ధ విమానాలు చేరడం అదనపు బలంగా మారనున్నాయి.

ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 యుద్ధ విమానాలను రూ. 59,000 కోట్లకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2021 వరకు మొత్తం యుద్ధ విమానాలు భారత్ చేరుకోనున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు లడఖ్ ప్రాంతంలో మోహరించే అవకాశం ఉంది.

Recommended Video

India V China: భారత్ టార్గెట్ గా పావులుకదుపుతోన్నChina,Pak,Nepal,Afghanistan మంత్రులకు దిశానిర్దేశం!

English summary
The first batch of India Air Force's (IAF) five Rafale jets that landed safely in Al Dhafra airbase (United Arab Emirates) on July 27, 2020, after a sortie in excess of 7 hours were clicked getting mid-air refueling at almost 30,000 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X