వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా ఆఫీసర్.. వింగ్ కమాండర్ విజయలక్ష్మి కన్నుమూత

|
Google Oneindia TeluguNews

భారత వాయిసేనలో మొట్టమొదటి కమిషన్డ్ మహిళా అధికారి, వింగ్ కమాండర్(రిటైర్డ్) డాక్టర్ విజయలక్ష్మి రమణన్ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న బుధవారం తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని తన కూతురు నివాసంలో చనిపోయేనాటికి విజయలక్ష్మి వయసు 96 ఏళ్లు.

1924 ఫ్రిబ్రవరిలో జన్మించిన విజయలక్ష్మి మెడిసిన చదివారు. కొంతకాలంపాటు గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ కూడా చేశారు. భర్త ప్రోత్సాహంతో 1955లో ఆర్మీలో చేరారు. ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్‌లో రిక్రూట్ అయిన ఆమె తన సర్వీస్ ముగిశాక ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యారు. భారత వాయుసేన (IAF)లో తొలి మహిళా ఆఫీసర్‌గా రికార్డ్ సృష్టించారు. 24 ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్‌లో సర్వీస్ చేసిన విజయలక్ష్మి 1979లో వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యారు.

iaf-s-first-woman-officer-vijayalakshmi-ramanan-retd-dies-at-96

ఎయిర్ ఫోర్స్‌లో విజయలక్ష్మిని అంతా ఆఫీసర్ 4971 అని పిలిచేవారు. అంతా మగవాళ్లే ఉన్న వాయుసేనలో ఏకైక మహిళగా వారికి దీటుగా పని చేసేవారు. ''జీవితంలో దేనినైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది. ఆ ధైర్యంతో మగవాళ్లతో పోటీగా పనిచేసేదాన్ని. కెరీర్ లో పెద్దగా లింగ వివక్ష ఎదుర్కోలేదు''అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

విజయలక్ష్మీ భర్త కెవి రామనన్‌ కూడా ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న రామణన్‌ చాలా చిన్న వయస్సులో అల్‌ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్‌గా పనిచేశారు.

English summary
Wing Commander (Retd) Dr Vijayalakshmi Ramanan, the first woman commissioned officer of the Indian Air Force, has died at the age of 96.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X