వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏరో ఇండియా షోలో స్యూర్య కిరణ్ యుద్ధ విమానాల ప్రదర్శన రద్దు, ప్రమాదం కారణం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు-బళ్లారి రోడ్డులోని యలహంక వాయుసేన ఎయిర్ బేస్ లో బుధవారం (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభం అయిన ఏరో ఇండియన్ షోలో (వైమానిక ప్రదర్శనలో సూర్య కిరణ్ యుద్ద విమానాల ప్రదర్శన రద్దు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు.

యలహంకలోని ఎయిర్ బేస్ లో మంగళవారం వైమానిక ప్రదర్శన ట్రైల్స్ నిర్వహించారు. ఆ సందర్బంలో రెండు సూర్యకిరణ్ యుద్ద విమానాలు ఆకస్మికంగా ఢీకొన్నాయి. సూర్య కిరణ్ యుద్దు విమానాలు యలహంక సమీపంలోని ఇంటి మీద పడిపోయాయి.

IAFs Surya Kiran Aerobatics Team won’t participate in Aero india show 2019.

సూర్య కిరణ్ యుద్ద విమానాల్లో ఉన్న ఇద్దరు పైలెట్లు ఆశ్చర్యకర రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మరో పైలెట్ పోహిల్ గాంధీ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్బంలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే వైమానిక ప్రదర్శనలో సూర్య కిరణ్ యుద్ద విమానాల ప్రదర్శన రద్దు చెయ్యాలని ఏరో ఇండియా నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు.

రెండు సూర్య కిరణ్ యుద్ద విమానాలు ఢీకొన్న సమయంలో ముగ్గురు పైలెట్లు ప్యారాచూట్ సహాయంతో కిందకుదిగారు. ముగ్గురు పైలెట్లలో విజయ్ శెట్కే, తేజశ్వర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరు పైలెట్లను హెచ్ఏఎల్ సమీపంలోని కమాండ్ ఆసుపత్రికి తరించి చికిత్స చేయిస్తున్నారు.

English summary
IAF's Surya Kiran Aerobatics Team won’t participate in Aero india show 2019. due to the loss of two aircraft and one pilot yesterday in a mid-air collision during rehearsal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X