వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

|
Google Oneindia TeluguNews

ఒడిషా: భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను వినియోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఈ క్షిపణికి ఉపరితలంలో విధించిన లక్ష్యాన్ని చేధించడంలో విజయవంతం అయ్యిందని రక్షణశాఖ తెలిపింది. ఈ క్షిపణి చేరడంతో భారత రక్షణశాఖ మరింత బలోపేతం అయ్యింది.

ఇక ఈ క్షిపణికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించేందుకు వివిధ పరికరాలను వినియోగించడం జరిగిందని రక్షణశాఖ పేర్కొంది. రేడార్లు, ఎలెక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం, సెన్సార్లను వినియోగించి ఆస్ట్రా క్షిపణి వివరాలను దగ్గరగా పరిశీలించడం జరిగిందని చెప్పారు. ఈ పరికరాలు ఇచ్చిన సమాచారం మేరకు ఉపరితలంలో ఆస్ట్రా క్షిపణి విజయవంతంగా లక్ష్యాలను చేధించిందని డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను ఎయిర్‌ఫోర్స్ బృందాలను అభినందించారు.

IAF successfully flight tests air-to-air Astra missile

ఒడిషా తీరంలో ప్రయోగించిన ఆస్ట్రా క్షిపణి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. కనుచూపు మేరా ఉన్న ఉపరితల లక్ష్యాలను సైతం చేధించగల సామర్థ్యం ఆస్ట్రా క్షిపణి సొంతం. లక్ష్యాన్ని చేధించే క్రమంలో గంటలకు 5,555 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుతుంది. 15 కేజీల భారీ పేలుడు పదార్థాలు దీని వార్‌ హెడ్‌లో ఉంటుంది. ఇక ఈ ఆస్ట్రా క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓ రూపొందించింది.మరో 50 ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు కూడా దీన్ని రూపొందిచడంలో కీలక పాత్ర పోషించాయి. ఆస్ట్రా క్షిపణులను మోసుకెల్లే సుఖోయ్ -30 ఎంకేఐను మోడిఫై చేసే బాధ్యత హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తీసుకుంది. సుఖోయ్ యుద్ధ విమానంకు ఈ మార్పులు చేయడంతోనే ఆస్ట్రా మిసైల్‌ను మోసుకెళ్లగలిగింది.

English summary
Indian Air Force on Tuesday successfully flight-tested air-to-air missile Astra off the coast of Odisha.The missile was launched from Su-30 MKI as a part of User trials. "The live aerial target was engaged accurately demonstrating the capability of the first indigenous air-to-air missile," the Ministry of Defence said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X