వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్‌కు, జయకు మధ్య అప్పటి వైరం ఏమిటి?

బతికున్న సమయంలో ఆమె మనసును గాయపర్చాను. అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయను ఓడించాలంటూ రజనీకాంత్ చేసిన ప్రకటనను ఆయన గుర్తుచేసుకొన్నారు. చో రామస్వామి, జయలలిత సంస్మరణ సభలో ఆయ

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:బతికున్న సమయంలో ఆమెను కొన్ని సార్లు గాయపర్చాను,. ఆమె నాయకత్వంలోని పార్టీ ఓటమి పాలవ్వడానికి కారణమయ్యాను అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యాలను ఆయన గుర్తుచేసుకొన్నారు.

rajainikanth

రజనీ ప్రకటనతో అన్నాడిఎంకె చిత్తుగా ఓటమి

జయలలిత పార్థీవ దేహం వద్ద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నీరు పెట్టుకొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఆమె పార్థీవ దేహం వద్ద ఆయన నివాళులర్పించారు. తమిళనాడులో ఇటీవలే మరణించిన జయలలిత, చో రామస్వామి సంతాపసభలో రజనీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నాడిఎంకె పార్టీకి ఓటు వేయకూడదని ఆయన ప్రకటించారు. జయలలిత మరోసారి అధికారంలోకి వస్తే దేవుడు కూడ తమిళనాడును కాపాడలేరని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆ ఎన్నికల్లో అన్నాడిఎంకె పార్టీ చిత్తు చిత్తుగా ఓటమిపాలైంది. 234 అసెంబ్లీ స్థానాల్లో కేవలం నాలుగు స్థానాలకే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. జయలలిత పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడ ఓటమిపాలైంది.

rajinikanth

రజనీకాంత్ కు జయలలితకు ఎందుకు వైరం

ఇద్దరూ కూడ సినీరంగానికి చెందిన వారే. జయలలిత కూడ గతంలో సినిమాల్లో నటించింది. రజనీ కాంత్ ఇంకా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే జయలలిత , రజనీ నివాసాలు కూడ దగ్గర దగ్గరే ఉంటాయి. జయలలితకు, రజనీ కాంత్ కు మద్య వైరానికి ఓ కథను కారణంగా చెబుతుంటారు స్థానికులు. ఈ కారణం సరైందో కాదో తెలీదు కాని, ఈ కథనమే చాలా కాలం నుండి ప్రచారంలో ఉంది.రజనీకాంత్ తన ఇంటికి వెళ్తుండగా, జయలలిత వస్తున్నారని అరగంటపాటు ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఈ ట్రాపిక్ లో రజనీకాంత్ నిలిచిపోయారు. అయితే దీంతో ఆగ్రహంతో రజనీకాంత్ పక్కనే ఉన్న పాన్ షాపు వద్దకు వెళ్ళి సిగరెట్ కాల్చాడట, దీంతో అభిమానులు రజనీకాంత్ ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్ జాం అయింది. ఈ ఘటనతో ఇద్దరి మద్య అంతగా సఖ్యత ఉండేది కాదని స్థానికులు చెబుతుంటారు. అందుకే 1996 ఎన్నికల్లో రజనీకాంత్ జయకు వ్యతిరేకంగా ఈ ప్రకటన చేశారని చెబుతుంటారు.

rajanikanth

2011 ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించని రజకీకాంత్

2011 ఎన్నికల్లో మాత్రం రజనీకాంత్ ఏ పార్టీకి తన మద్దతును ప్రకటించలేదు తమ ఇష్టమున్నవారికి ఓటు చేయాలని ఆయన తన అభిమానులను కోరారు. చాలా కాలంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడ ఉంది. అయితే రాజకీయాల్లో చేరిక విషయమై ఆయన ఇంకా స్టష్టంగా ప్రకటన చేయలేదు.. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ తమిళ సూపర్ స్టార్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగింది. కాని, ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

English summary
rajinikanth one statement aiadmk collapse in 1996 assembly elections,if jaya will be next time cm god wil not save tamilnadu said rajini in 1996 elections. this statement effect on aiadmk. out of 234 seats, 4 seats won aiadmk. rajini rember this incident on sunday at the meeting in chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X