బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఏఎస్: డీకే రవిది ఆత్మహత్య: సీబీఐ

ఐఏఎస్ అధికారి డీకే. రవి ఆత్మహత్య చేసుకున్నారని సీబీఐ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. వ్యక్తిగత కారణాల వల్ల డీకే రవి ఆత్మహత్య చేసుకున్నారని సీబీఐ అధికారులు దర్యాప్తు .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే. రవి ఆత్మహత్య చేసుకున్నారని సీబీఐ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. వ్యక్తిగత కారణాల వల్ల డీకే రవి ఆత్మహత్య చేసుకున్నారని సీబీఐ అధికారులు దర్యాప్తు చేసి తుది నివేదికలో ఈ విషయం స్పష్టం చేశారు.

గత 20 నెలల నుంచి సీబీఐ సీనియర్ అధికారి చక్రవర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేసి నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను బెంగళూరు దక్షిణ అసిస్టెంట్ కమిషనర్ కు అందించారు.

IAS D K Ravi had committed suicide due to personal reasons the CBI filed a closure report

2015 మార్చి 16వ తేదీన మడివాళ సమీపంలోని తన సొంత ప్లాట్ (అపార్ట్ మెంట్ )లో డికే. రవి ఉరి వేసుకుని మరణించినట్లు కనిపించారు. అప్పట్లో విపక్షాలు (బీజేపీ, జేడీఎస్) పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేసును సీబీఐకి అప్పగించారు.

అప్పటి నుంచి సీబీఐ అధికారులు డికే. రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చివరికి వ్యక్తిగత కారణాలవల్ల ఐఏఎస్ అధికారి డీకే. రవి ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు నివేదిక తయారు చేశారు. అయితే ఈ విషయంపై డీకే రవి కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేస్తున్నారు.

డీకే రవి తల్లి గౌరమ్మ సీబీఐ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. డీకే. రవిది ఆత్మహత్య కాదని ఆమె అంటున్నారు. డికే. రవి విషయంలో తమకు ఉన్న అనుమానాలు సీబీఐకి చెప్పడానికి చాల సార్లు ప్రయత్నించామని, అందుకు వారు అనుమతి ఇవ్వలేదని గౌరమ్మ ఆరోపించారు.

English summary
While concluding that D K Ravi had committed suicide due to personal reasons the Central Bureau of Investigstion filed a closure report before the Assistant Commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X