వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27 ఏళ్ల సర్వీసు.. 52వ సార్లు బదిలీ

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారులకు పార్వతీపురం అడవులకు ట్రాన్స్ ఫర్ చేసే సన్నివేశాలను 80ల కాలం నాటి సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి దృశ్యాలే నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, రాజకీయ నాయకులకు కంట్లో నలుసులా తయారయ్యే అధికారులకు బదిలీ వేటు పడుతూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారి పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు.

తాజాగా హర్యానాలో మరో సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు బదిలీ కావడం దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. ఆయనే- అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐఎఎస్ అధికారి. తన 27 సంవత్సరాల సర్వీసులో 52వ సారి ఆయన బదిలీ అయ్యారు. విశేషమేమిటంటే- ఈ బదిలీల వ్యవహారంలో ఆయన కొన్ని శాఖల్లో రెండుసార్లు చొప్పున పనిచేశారు. హర్యానా ప్రభుత్వంలో క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అశోక్ ఖేమ్కాను అక్కడి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

IAS officer Ashok Khemka transferred for 52nd time in 27-year career

పెద్దగా ప్రాధాన్యత లేదని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ, డీఎల్‌ఎఫ్ మధ్య భూ ఒప్పంద పత్రాలను రద్దు చేయడం ద్వారా అశోక్ ఖేమ్కా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. అప్పటి నుంచి ఎక్కడ కూడా ఆయన ఏడాది పాటు కుదురుగా కూర్చోలేదు. బదిలీల మీద బదిలీలు వెన్నాడుతున్నాయి.

English summary
The Haryana government on Sunday issued transfer and posting orders for nine IAS officers with immediate effect, including 1991-batch senior bureaucrat Ashok Khemka. Ashok Khemka, principal secretary of Sports and Youth Affairs Department has been posted as principal secretary of Science and Technology Department, where he had been posted earlier as well. The 1991-batch IAS officer had first been mentioned by the media in 2012 when he had cancelled the mutation of a land deal between Congress leader Sonia Gandhi's son-in-law Robert Vadra's Skylight Hospitality and major real estate developer DLF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X