వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్..జల్లి కీర్తి, జనాలకు సర్వీస్, ఫిదా అవుతున్న నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

జనం బాగోగులను నేతలు/ బ్యూరొక్రాట్లు పట్టించుకోవడం రేర్.. అంటే పరిష్కారం చూపుతారు.. కానీ అంత తొందరగా కాదు.. అలాగే దగ్గరుండి మరీ హెల్ప్ చేయడం వేరు.. ఏదో ఎన్నికల సమయంలో మాత్రమే అలా చేసేవారు ఉంటారు. కానీ కొందరు బ్యూరొక్రాట్లు నిజమైన ప్రజ సేవలో నిమగ్నం అవుతున్నారు. తెలంగాణ బిడ్డ ఐఏఎస్ అధికారి జల్లి కీర్తి కూడా అదే జాబితాలో చేరారు. తన జిల్లా పరిధిలో గల ప్రజలకు సేవ అందిస్తున్నారు. మిగతా అధికారుల లాగా కాకుండా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. సర్వీస్ చేస్తున్నారు. వరదల్లో ఉన్న వారికి తగిన సాయం చేస్తున్నారు.

ప్రజలకు సేవ

ప్రజలకు సేవ


అసోం కేడర్ ఐఏఎస్ అధికారి జల్లి కీర్తి.. కష్టాల్లో ఉన్న ఆ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నారు. కీర్తి వరంగల్‌లో పుట్టి పెరిగారు. అసోం కచార్‌ డిప్యూటీ కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. వారం రోజులుగా అసోంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో ర‌హ‌దారులు, రోడ్లు, భ‌వ‌నాలు.. ఇలా అన్నింటిపై ప్రభావం చూపాయి. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

 ఆసరగా నిలచి

ఆసరగా నిలచి


వారికి కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు. అక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడాన్ని చూసి యావత్‌ సోషల్‌ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్‌లు అభినందిస్తున్నారు.

వృత్తిపై నిబద్ధత

వృత్తిపై నిబద్ధత


కీర్తికి వృత్తిపై ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న మమకారానికి అంతా ఫిదా అవుతున్నారు. అవును మరీ.. ఆమె బ్యూరొక్రాట్ అయినా.. ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మిగతా అధికారులు కూడా ఆమెలా పనిచేయాలని కొందరు అంటున్నారు. సో జల్లి కీర్తి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

English summary
ias officer jalli keerthi service to assam flood affected places
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X