వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీనా దాబి ఐఏఎస్ కు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ దెబ్బ, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా, అగ్నికి ఆజ్యం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలతో దేశం నలుమూలు అట్టుడుకుతున్న నేపథ్యంలో కొంత మంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హిందీ భాషలో పోస్టులో చెయ్యడంతో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి సైతం షాక్ కు గురై తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

హిందీ భాషలో పోస్ట్

హిందీ భాషలో పోస్ట్

ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో ఫేస్ బుక్ (నకిలీ)లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హిందీలో పోస్టులో చెయ్యడంతో కలకలం రేపింది. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది. బాధ్యత కలిగిలిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబినే ఇలా చేస్తే ఇక కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేది ఎవరు ? అంటూ చాలా మంది చర్చ మొదలుపెట్టారు.

ఫేస్ బుక్ అకౌంట్ నాదికాదు దేవుడా

ఫేస్ బుక్ అకౌంట్ నాదికాదు దేవుడా

తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ప్రారంభించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుసుకున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి సైతం హడలిపోయారని తెలిసింది. తన పేరుతో ఎవరో కావాలనే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తో తప్పుడు ప్రచారం చేస్తున్నానరని, తనకు ఆ పోస్ట్ కు ఎలాంటి సంబంధం లేదని టీనా దాబి బుధవారం ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి వివరణ ఇచ్చారు.

దళిత యువతి

దళిత యువతి

ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం 2015లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సంపాధించుకున్నారు. చురుకైన అధికారిణిగా టీనా దాబి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది దళిత యువతులకు టీనా దాబి రోల్ మాడల్ గా నిలిచారు.

ముస్లీం ఐఏఎస్ తో లవ్ మ్యారేజ్

ముస్లీం ఐఏఎస్ తో లవ్ మ్యారేజ్

2015 బ్యాచ్ కు చెందిన (టీనా దాబి బ్యాచ్) కాశ్మీరీ అథర్ ఖాన్ ను టీనా దాబి ప్రేమించారు. అథర్ ఖాన్ సైతం సివిల్ సర్వీసెస్ లో రెండవ ర్యాంకు సాధించారు. టీనా దాబి, అథర్ ఖాన్ ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. గత ఏడాది టీనా దాబి, అథర్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లోని భిల్వారాలో టీనా దాబి, అథర్ ఖాన్ కు పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు.

పాకిస్తాన్ లో మతపరమైన హింస

పాకిస్తాన్ లో మతపరమైన హింస

పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31న లేదా, అంతకు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లీమేతర శరణార్థులకు త్వరతగతిన భారత పౌరసత్వం కల్పించడానికి వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందిన విషయం తెలిసిందే.

అగ్నికి ఆజ్యం పోశారు

అగ్నికి ఆజ్యం పోశారు

అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం జరగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.

English summary
IAS Tina Dabi fake facebook page criticised the Citizenship law. She will file a police complaint about a fake page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X