బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, చిక్కుల్లో చిన్నమ్మ ఫ్యామిలీ, బ్యాంకు అకౌంట్లు, ఎవరు ఆ నటుడు ?

అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ దేశ ప్రజలకే పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ దేశ ప్రజలకే పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసింది. జైల్లో శశికళకు రాచమర్యాదలు చేయించిన ఆమె బంధువులను విచారణ చెయ్యాలని అధికారులు సిద్దం అయ్యారు.

జైల్లో శశికళ జల్సాలు, సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ నిజమే, ఆమె అక్కడ దర్జాగా: డీఐజీ రూప !జైల్లో శశికళ జల్సాలు, సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ నిజమే, ఆమె అక్కడ దర్జాగా: డీఐజీ రూప !

శశికళ బంధవులను బెంగళూరుకు పిలిపిస్తే రారని, మాయమాటలు చెబుతారని పసిగట్టిన అధికారులు తామే చెన్నై వెళ్లాలని నిర్ణయించారు. చెన్నై వెళ్లి శశికళ బంధవులు, అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలోని కొందరు నాయకులు, మన్నార్ గుడి మాఫియా సభ్వులను విచారణ చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది.

శశికళ కుటుంబీకుల మెడకు ?

శశికళ కుటుంబీకుల మెడకు ?

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ జీవితం వ్యవహారం ఆమె కుటుంబికుల మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శశికళ కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ చేసేకుందుకు రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సిద్దం అయ్యింది.

Recommended Video

Sasikala bribes prison officers, gets luxury treatment in jail | Oneindia News
చిన్నమ్మ ఫ్యామిలీ మీద

చిన్నమ్మ ఫ్యామిలీ మీద

శశికళ జైలుకు వెళ్లిన తరువాత ఆమె సోదరి వణితామణి కుమారుడు టీటీవీ దినకరన్ జైల్లో శశికళను కలుస్తున్న విషయం అధికారికంగా బయటకు వస్తున్నది. అయితే ఆమె కుటుంబ సభ్యులు (మన్నార్ గుడి ఫ్యామిలీ) మాత్రం చాపకింద నీరులా బెంగళూరు చేరుకుని చిన్నమ్మతో ములాఖత్ అవుతున్నారు.

అధికారం కోసం ఆరాటం

అధికారం కోసం ఆరాటం

అన్నాడీఎంకే పార్టీ మీద పట్టుకోసం టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నాడు. శశికళ సోదరుడు దివాకరన్ కూడా తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాడు. ఇక చిన్నమ్మ భర్త నటరాజన్ సుప్రీం కోర్టులో పునస్సమీక్షా పటిషన్ వేసి శశికళను జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరు ఆ ఎమ్మెల్యే ?

ఎవరు ఆ ఎమ్మెల్యే ?

అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలోని ఓ ఎమ్మెల్యే కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఓ హాస్యనటుడి సహాయంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు లగ్జరీ లైఫ్ గడిపే విదంగా వ్యవహారం నడిపించాడని మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ బృందం గుర్తించిందని తెలిసింది.

ప్రైవేటు బ్యాంకులో

ప్రైవేటు బ్యాంకులో

ఓ ప్రైవేట్ బ్యాంకులో శశికళ కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో నగదు డ్రా చేశారని దర్యాప్తు చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని 25 మంది అధికారుల బృందం గుర్తించింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? అని ఆరా తీస్తున్నారు.

లంచం బ్యాంకులో డిపాజిట్ చేశారా ?

లంచం బ్యాంకులో డిపాజిట్ చేశారా ?

శశికళ లగ్జరీ లైఫ్ గడపడానికి కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని డీఐజీ రూప ఆరోపించారు. డీఐజీ రూప చేసిన ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులకు ఆ రూ. 2 కోట్లు ఎలా వచ్చాయి ? అధికారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేశారా ? నేరుగా ఇచ్చారా ? అని ఆరా తీయ్యాలని అధికారులు నిర్ణయించారు.

హడలిపోతున్నారు

హడలిపోతున్నారు

వినయ్ కుమార్ నేతృత్వంలోని 25 మంది అధికారులు చెన్నై వస్తున్నారని సమాచారం బయటకు రావడంతో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే, ఆపార్టీలోని కొందరు నాయకులు, శశికళ ఫ్యామిలీ సభ్యులు హడలిపోతున్నారని తమిళ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. మొత్తం మీద శశికళ దెబ్బతో జైల్లో ఆమెతో భేటీ అయిన అందరికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం.

English summary
IAS Officer Vinay Kumar comes to chennai to investigate Sasikala bribe case. Officers gathered evidence and going to inquiry Sasikala's relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X