• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ తెరపైకి ఐఏఎస్ టాపర్ టీనా దాబి -భర్త ఖాన్‌తో విడాకులు కోరుతూ దావా -లవ్ జీహాద్ వేళ హాట్ టాపిక్

|

దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబి మళ్లీ వార్తల్లో నిలిచారు. యూపీఎస్సీ 2015 సివిల్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన టీనా.. అదే బ్యాచ్ లో రెండో ర్యాంకు పొందిన అథర్ ఆమిర్ ఖాన్ ను ప్రేమించి పెళ్లాడటం తెలిసిందే. ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్ అధికారులుగా జైపూర్ లో విధులు నిర్వహిస్తున్న ఈ ఇద్దరూ విడాకుల కోసం శుక్రవారం జైపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

కొవిడ్-19 షాకింగ్: రెమ్‌డెసివిర్‌ వాడొద్దు -పీక్యూ జాబితా నుంచి తొలగింపు -WHO కీలక ప్రకటనకొవిడ్-19 షాకింగ్: రెమ్‌డెసివిర్‌ వాడొద్దు -పీక్యూ జాబితా నుంచి తొలగింపు -WHO కీలక ప్రకటన

ఢిల్లీకి చెందిన టీనా దాబి, జమ్మూకాశ్మీర్ కు చెందిన అథర్ ఆమిర్ ఖాన్ 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి లవ్ స్టోరీపై అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కానీ, రెండేళ్లలోపే వారి మధ్య పొరపొచ్చలు రావడం, వ్యవహారం విడాకుల దాకా దారితీశాయి. మొన్న మార్చిలో టీనా తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరు చివర 'ఖాన్' పదాన్ని తొలగించగా, భర్త అథర్ సైతం ఆమెను అన్ ఫాలో చేయడంతో విడాకులపై మొదటిసారి వార్తలు వచ్చాయి.

IAS toppers Tina Dabi, Athar Khan file for divorce in Jaipurs family court

టీనా, ఖాన్ లను కలిపి ఉంచడానికి ఐఏఎస్ స్నేహితులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇద్దరి మధ్య ఏ కారణంగా గొడవలొచ్చాయనేది వెల్లడి కానప్పటికీ,దంపతులిద్దరూ తమ స్టేటస్ ను సింగిల్ అని పెట్టడంతో విడాకులు ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. కొంతకాలంగా దూరంగా ఉంటోన్న ఈ ఇద్దరూ పరస్పర సమ్మతితో శుక్రవారం జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు. కాగా,

IAS toppers Tina Dabi, Athar Khan file for divorce in Jaipurs family court

అథర్ ఆమిర్ ఖాన్.. టీనాను పెళ్లాడటాన్ని లవ్ జీహాద్ గా అభివర్ణిస్తూ కొన్ని హిందూ సంఘాలు గతంలో నిరసనలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీ పాలనలోని పలు రాష్ట్రాలు లవ్ జీహాద్ ను నిషేధిస్తూ చట్టాలు రూపొందిస్తున్న తరుణంలోనే టీనా-ఖాన్ విడిపోతుండటం సదరు సంఘాలకు మళ్లీ ఊతమిచ్చినట్లయింది. ఆ మధ్య వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తాను తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ పేరుతో ఓ పోస్టు వైరల్ కావడం, పలు చానెళ్లు దీనిపై వార్తలు ప్రసారం చేయడంపై ఆమె ఫిర్యాదు చేయగా, చివరికది ఫేక్ అకౌంట్ అని తేలింది.

బీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ -రాష్ట్ర నేతలకు చుక్కలు -కేంద్రంతోనే డీల్ -గ్రేటర్‌లాగే తిరుపతిలోనూబీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ -రాష్ట్ర నేతలకు చుక్కలు -కేంద్రంతోనే డీల్ -గ్రేటర్‌లాగే తిరుపతిలోనూ

  China Village In Bhutan డోక్లాంకు అత్యంత సమీప భూభాగాన్నిఆక్రమించిన చైనా.. భారత్‌కు ప్రమాదం...!!

  IAS toppers Tina Dabi, Athar Khan file for divorce in Jaipurs family court
  English summary
  IAS Tina Dabi, topper of Union Public Service Commission (UPSC) examination’s 2015 batch and her husband, IAS Athar Khan, have filed for divorce. The duo has filed for divorce with mutual consent in a family court in Jaipur. Tina Dabi and Athar Khan had married in 2018.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X