వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐబీసీ 2018: భారత బ్యాంకులకు రిస్క్ తట్టుకునే సామర్థ్యం తక్కువ: రాజీవ్ కుమార్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రాథమిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ కాంక్లేవ్ 2018లో భాగంగా 'ఇండియా విజన్ 2030 అండ్ బ్యాంకింగ్' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

తనకు బ్యాంకింగ్ రంగంతో దీర్ఘ కాలిక అనుబంధం ఉందని చెప్పిన రాజీవ్ కుమార్.. స్టార్టప్, స్టాండప్ వంటివే ఆర్థిక వృద్ధిని నిర్ణయిస్తాయని తెలిపారు. రాబోయే కాలం మరింత కీలకమని అన్నారు. వ్యవసాయ రంగానికి బ్యాంకింగ్ రంగం ఏ విధంగా అండగా ఉంటుందో చూడాలని అన్నారు.

IBC 2018: Indian banks have limited capability to assess risk, says NITI Aayog vice chairman

భారత వాణిజ్య బ్యాంకులు ప్రస్తుతం రిస్కును అంచనా వేయడంలో పరిమిత సామర్థ్యాన్నే కలిగి ఉన్నాయని రాజీవ్ కుమార్ అన్నారు. బ్యాంకులు సరైన పద్ధతిలో వెళ్లని కారణంగానే 3సీఎస్-సీవీసీ, సీబీఐ, కాగ్ లాంటికి భయపడాల్సి వస్తోందని తెలిపారు.

వారంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పీజే నాయర్ కమిటీ ఇచ్చిన నివేదిక మంచి సూచనలు చేసిందని.. బ్యాంకింగ్ రంగానికి అవి చాలా మంచి చేస్తాయని రాజీవ్ కుమార్ అన్నారు. ఆర్బీఐకి కూడా క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియవని చెప్పారు.

English summary
Speaking on 'India Vision 2030 and Banking' at the Indian Banking Conclave 2018, NITI Aayog's vice chairman Rajiv Kumar called for fundamental changes in the Indian banking system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X