వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చందా కొచ్చర్‌‌కు ఎదురుదెబ్బ.. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌కు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొచ్చర్‌కు సంబంధించి ముంబైలోని ఇంటితో పాటు ఆమెకు సంబంధించిన ఓ కంపెనీ ఆస్తులు కూడా ఉన్నాయి.ప్రివెన్ష్‌న్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు అధికారిక ఆర్డర్‌ను విడుదల చేసింది ఈడీ. ఇక ఇప్పటి వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ మొత్తం రూ.78 కోట్లుగా ఉన్నింది.

చందా కొచ్చర్ పై మనీలాండరింగ్ కేసు

చందా కొచ్చర్ పై మనీలాండరింగ్ కేసు

గతేడాది ఈడీ చందా కొచ్చర్‌పై మనీలాండరింగ్ చట్టం కింద క్రిమినల్ కేసును నమోదు చేసింది. చందా కొచ్చర్‌తో పాటు భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్‌ మరికొంతమందిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఓ కార్పొరేట్ గ్రూప్‌కు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,875 కోట్లు రుణాలు మంజూరు చేయడంలో అవినీతి అవకతవకలు జరిగాయని ఈడీ గుర్తించింది. ఈ మేరకు వీరిపై కేసులను నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో రంగంలోకి దిగిన ఈడీ కేసును విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను కూడా చేర్చింది.

క్విడ్ ప్రో కో ఆరోపణలు

క్విడ్ ప్రో కో ఆరోపణలు

ఇక వేణుగోపాల్ దూత్‌కు సంబంధించిన సుప్రీం ఎనర్జీ కంపెనీ, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నడుపుతున్న ఎన్‌యూపవర్ రిన్యూవబుల్స్ కంపెనీలను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఎన్‌యూ పవర్ కంపెనీలో తన సొంత సంస్థ సుప్రీం ఎనర్జీ ద్వారా వేణుగోపాల్ దూత్ పెట్టుబడులు పెట్టారని సీబీఐ గుర్తించింది. ఇక్కడే క్విడ్ ప్రొ కో జరిగిందని సీబీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా చందా కొచ్చర్ 2009 మే 1న బాధ్యతలు చేపట్టగానే దూత్ కంపెనీకి ఇచ్చిన రుణాలను క్లియర్ చేసిందని సీబీఐ వెల్లడించింది. రుణాలు క్లియర్ కాగానే చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ సంస్థలోకి పెట్టుబడులు వెళ్లాయని సీబీఐ గుర్తించింది.

స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీపై కూడా కేసులు

స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీపై కూడా కేసులు


ప్రాథమిక విచారణలో భాగంగా వీడియోకాన్ గ్రూప్‌కు రూ.1875 కోట్లు రుణాలు మంజూరు అయ్యాయని సీబీఐ గుర్తించింది. ఇది జూన్ 2009 నుంచి అక్టోబర్ 2011 వరకు ఆరుసార్లు రుణాలను మంజూరు చేసినట్లు సీబీఐ పేర్కొంది.ఐసీఐసీఐ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు సీబీఐ గుర్తించింది. 2012లో ఈ రుణాలను నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా రికార్డ్ కావడంతో బ్యాంకుకు రూ.1730 కోట్లు నష్టం వాటిల్లిందని సీబీఐ పేర్కొంది. ఇక దీనితో పాటుగా చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా ఉన్న సమయంలోనే గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీకి, భూషణ్ స్టీల్ గ్రూప్‌కు రుణాలు మంజూరు అయ్యాయని వీటిపై కూడా మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

English summary
The Enforcement Directorate (ED) on Friday provisionally attached the Mumbai apartment and other assets of former ICICI Bank CEO and MD Chanda Kochhar, who is being investigated for loan fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X