వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, హెచ్‌సీక్యూలను తొలగించిన ఐసీఎంఆర్: ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న ఔషధాలపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కీలక సూచనలు చేసింది. ఐవర్‌మెక్టిన్, , హైడ్రాక్సీ క్లోరోక్వీన్(హెచ్‌సీక్యూ) ఔషధాలను కరోనా చికి్తస మార్గదర్శకాల జాబితా నుంచి తొలగించింది. బాధితుల్లో కరోనావైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఐవర్‌మెక్టిన్, హెచ్‌సీక్యూ ఔషధాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయనేందుకు సరైన ఆధారాలు లభించకపోవడంతోనే ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ మోనిటరింగ్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దవాళ్లకు కొవిడ్ చికిత్స మార్గదర్శకాల సవరణలో ఈ రెండు మెడిసిన్స్ ఇకపై కోవిడ్ చికిత్సకు వినియోగించకూడదని వెల్లడించింది. కరోనా సోకినవారికి డాక్టర్లు చికిత్సలో భాగంగా రెమ్ డిసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. కానీ ఇకనుంచి ఈ ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను ఇకనుంచి కోవిడ్ చికిత్సకు ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది.

ICMR drops Ivermectin, HCQ from Coronavirus treatment guidelines.

కాగా, ప్రత్యేక సందర్భంల్లో మాత్రమే ఈ రెమ్ డిసివిర్, టోసిలిజుమాబ్ మెడిసిన్స్ ను వాడాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్న రోగులకు మాత్రమే రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలతో కూడిన చికిత్స అందించాలని ఐసీఎంఆర్ అనుబంధ విభాగం తెలిపింది. కాగా, కోవిడ్-19 నిబంధనల్ని మాత్రం కొనసాగించాల్సిందేనని ఈ సందర్భంగా ఐసీఎంఆర్ స్పష్టంచేసింది.

మాస్కులు ధరించడం,శారీరక శుభ్రతతో పాటు పరిశసరాల పరిశుభ్రత, శానిటైజర్ వినియోగం వంటివి తప్పనిసరి అని తెలిపింది. అలాగే భౌతిక దూరం అనేది కూడా పాటించాలని వెల్లడించింది. కోవిడ్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటునే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలని సూచించింది.

రోగ లక్షణాలను బట్టి యాంటిపైరెటిక్, యాంటిట్యూసివ్ మరియు మల్టీవిటమిన్‌లను తీసుకోవచ్చు.అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా హై-గ్రేడ్ జ్వరం లేదా తీవ్రమైన దగ్గు, ప్రత్యేకించి వంటివి ఎక్కువరోజులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వారి సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆందోళన పడకుండా ప్రశాంతంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా ఐసీఎంఆర్ సూచనలు చేసింది.

దేశంలో గత రెండు రోజులుగా కరోనా వైరస్ కేసులు 30వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా, 31వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు పైనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,65,696 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,382 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కు పెరిగింది. గురువారం 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,46,368లకు పెరిగింది. గురువారం 32,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,28,48,273కు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,00,162 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. గురువారం 72,20 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 84.15 కోట్లకు చేరింది.

English summary
ICMR drops Ivermectin, HCQ from Coronavirus treatment guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X