వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron వేరియంట్‌కు మన హైదరాబాద్ టీకా: శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. కరోనా జాతికే చెందిన ఈ ప్రమాదకర వేరియంట్... అత్యంత వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి విరుగుడు ఏంటనే చర్చ కూడా ప్రపంచ దేశాల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు ప్రముఖ వైద్యులు శాస్త్రవేత్తలు మన హైదరాబాదులో తయారైన వ్యాక్సిన్‌ను ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యాక్సిన్ ఏంటి..?

ఒమిక్రాన్‌ను కొవాగ్జిన్ నిలువరిస్తుందా..?

ఒమిక్రాన్‌ను కొవాగ్జిన్ నిలువరిస్తుందా..?

కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సిన్‌ తయారీ అంటే కేరాఫ్‌గా భారత్ అని ప్రపంచ దేశాలు మాట్లాడుకున్నాయి. ముందుగా కొవిషీల్డ్ ఆ తర్వాత కొవాగ్జిన్. ఈ రెండు టీకాలు ప్రపంచ దేశాలకు ఉపశమనం కలిగించాయి. అయితే తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌పై మాత్రం ఎలాంటి టీకా పనిచేస్తుందనే విషయం జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు మన హైదరాబాదులో ఉన్న భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌ టీకాను సూచిస్తున్నారు. కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ సమయంలోనే మంచి ఫలితాలను ఇచ్చిందని ఇది కరోనా వేరియంట్స్ అయిన బీటా డెల్టా, లాంబ్డా, వేరియంట్లను నిలువరించగలిగే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ కోవలోకే ఒమిక్రాన్ కూడా వస్తుందని .. ఈ మహమ్మారిపై కూడా సక్సెస్‌ఫుల్‌గా కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనిచేస్తుందనే కాన్ఫిడెన్స్‌ను వారు వ్యక్తం చేస్తున్నారు.

సైంటిస్టుల కాన్ఫిడెన్స్ ఏంటి..?

సైంటిస్టుల కాన్ఫిడెన్స్ ఏంటి..?

ప్రమాదకరమైన ఆల్ఫా, బీటా, గామా డెల్టా వేరియంట్లను సమర్థవంతంగా నిలువరించగల సామర్థ్యం కొవాగ్జిన్‌కు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం భయాందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా అడ్డుకోగలదనే విశ్వాసం వ్యక్తం చేశారు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే కొవాగ్జిన్ ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి సురక్షితంగా కాపాడుతుందనే నమ్మకం తమకుందని చెప్పారు. శాంపిల్స్ రాగానే వ్యాక్సిన్ యొక్క కచ్చితత్వాన్ని పరీక్షిస్తామని ఇది పూణేలోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షిస్తామని అధికారి ఒకరు వెల్లడించారు. వూహాన్‌లో పుట్టిన ఒరిజినల్ కరోనావైరస్‌ను దృష్టిలో ఉంచుకుని కొవాగ్జిన్ తయారు చేయడం జరిగిందని మరొక అధికారి వెల్లడించారు. ఇది ఇతర వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేయగలదని చెబుతున్నారు. మరింత లోతైన పరిశోధనలు చేస్తే కచ్చితంగా ఈ విషయం వెలుగులోకి వస్తుందని చెప్పారు.

Recommended Video

Omicron Variant : Omicron Enters In India || Oneindia Telugu
కొవాగ్జిన్‌కు ఇతర టీకాలకు తేడా ఏంటి..?

కొవాగ్జిన్‌కు ఇతర టీకాలకు తేడా ఏంటి..?

ఇతర వ్యాక్సిన్‌లలా కాకుండా కొవాగ్జిన్ mRNA స్పైక్ ప్రొటీన్‌తో పాటు మిగతాయాంటిజెన్స్ ఎపిటోప్స్‌లపై సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. మోడర్నా, ఫైజర్‌లాంటి వ్యాక్సిన్‌లు కేవలం స్పైక్ ప్రోటీన్‌లు ఉన్న mRNAపై మాత్రమే పనిచేస్తాయని చెప్పారు. అయితే దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందని వాక్‌హార్ట్ హాస్పిటల్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు చెప్పారు. ఒమిక్రాన్‌ 30 మ్యూటేషన్స్‌కు పైగా ఉన్నాయని, అదే సమయంలో రోగనిరోధక శక్తిని సైతం దాటుకుని అది మనిషిపై దాడి చేయగలదని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్‌ల కచ్చితత్వాన్ని జాగ్రాత్తగా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.

English summary
ICMR Scientists say Covaxin vaccine has the capacity to work against Omicron.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X