వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కట్టడిలో కీలకంగా బీసీజీ వ్యాక్సిన్: వృద్దులలోనూ సానుకూల ఫలితాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు కనబరుస్తున్నాయి. ఈ సమయంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా, తన పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..

రోగనిరోధకత పెంచడంలో బీసీజీ కీలకం..

రోగనిరోధకత పెంచడంలో బీసీజీ కీలకం..


ఇప్పటికే అందుబాటులో ఉన్న బీసీజీ(బాసిల్లస్ కాల్మెట్-గురిన్) టీకా వృద్ధుల్లో సహజ రోగనిరోధక శక్తిని ప్రేరేపించడంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు ఐసీఎంఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పుట్టుకతో సహజంగా వచ్చిన రోగనిరోధకతను మరింత మెరుగుపర్చడంతోపాటు, దాన్ని మరింత కాలం కొనసాగించడంలో బీసీజీ టీకా దోహదపడుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

కరోనాను ఎదుర్కోవడంలో బీసీజీ..


కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో మరింత ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని తాజా పరిశోధన నిరూపించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరింత సమర్థతను తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా కరోనాపై బీసీజీ వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఆరోగ్యవంతులైన వృద్ధుల(60-80ఏళ్ల)లను పరిగణలోకి తీసుకున్నారు. వీరికి బీసీజీ టీకా అందించి, తదుపరి నెలరోజుల్లో వారిలోని టీ కణాలు, బీ కణాలు, మోనోసైట్‌లతోపాటు యాంటీబాడీల స్థాయిలను పరిశోధించారు.

బీసీజీతో మెరుగైన ఫలితాలు..

బీసీజీతో మెరుగైన ఫలితాలు..

అనంతరం వృద్ధుల్లో సహజ, రోగనిరోధక శక్తిని ప్రేరేపించడంలో బీసీజీ టీకా మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు గుర్తించారు. సహజ రోగనిరోధక శక్తిని ప్రేరేపించే సామర్థ్యం కలిగిన ఈ బీసీజీ వ్యాక్సిన్‌ను క్షయవ్యాధిని ఎదుర్కోవడంతోపాటు వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగించేందుకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కరోనాపై దీని పనితీరును తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది.

Recommended Video

COVID-19 : Corona Vaccine Clinical Trials విఫలం.. దాని వల్ల ఏ ఉపయోగమూ లేదన్న అమెరికా! || Oneindia
100ఏళ్లుగా బీసీజీ మనుగడలోనే..

100ఏళ్లుగా బీసీజీ మనుగడలోనే..


దాదాపు 100 సంవత్సరాలుగా మనుగడలో ఉన్న బిసిజి వ్యాక్సిన్ ఇప్పుడు అన్ని వ్యాక్సిన్లలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నది. ఇది క్షయవ్యాధిని ముగించడానికి రూపొందించబడింది. మెనింజైటిస్.. పిల్లలలో వ్యాప్తి చెందుతున్న టిబికి వ్యతిరేకంగా రక్షణాత్మక ప్రభావాన్ని కలిగి ఉంది. కాగా, బిసిజి టీకా.. కోవిడ్ 19 నుంచి అధిక రక్షణను ప్రేరేపించిందని ఇటీవల నిర్వహించిన అనేక ఇతర అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కూడా లాన్సెట్ కథనం రచయితలలో ఒకరు. బిసిజి వ్యాక్సిన్ "వ్యాధి-నిర్దిష్ట వ్యాక్సిన్ అభివృద్ధి చెందకముందే అంతరాన్ని తగ్గించే" సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు.

English summary
A recent study by the Indian Council of Medical Research (ICMR) has found that Bacillus Calmette-Guerin (BCG) vaccine can prove effective for tackling coronavirus infection among the elderly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X