వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిర్యాదులొస్తున్నాయ్, ఇబ్బంది పెట్టొద్దు: బ్యాంకులకు ఆర్బీఐ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, 1000 నోట్లను మార్చుకునేందుకు వచ్చిన ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని భారత రిజర్వు బ్యాంక్.. బ్యాంకులకు స్పష్టం చేసింది. నోట్ల మార్పిడి కోసం వచ్చిన కష్టమర్లను ఫొటోలు, ఐడీ ప్రూఫ్ అడగవద్దని తేల్చి చెప్పింది.

అంతేగాక, రూ.500, వెయ్యి నోట్ల నగదు మార్పిడి విషయంలో కచ్చితమైన నియమ, నిబంధనలు పాటించాలని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అర్బన్‌ కో-ఆపరేటివ్‌, స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులను ఆదేశించింది.

ID proof photocopy not required while exchanging notes: RBI

ముఖ్యంగా ఖాతాదారుల నుంచి నగదు స్వీకరణలో కో-ఆపరేటివ్‌ బ్యాంకులను నుంచి సహకారం లేదంటూ పలు చోట్ల ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.

'అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, నాబార్డులు.. ఆర్‌బీఐ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఖాతాదారుల నుంచి పాత నగదు తీసుకుని కొత్తవి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు' అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

English summary
The RBI while providing relief to several customers, has asked banks not to collect photocopies of customers' identity proof while exchanging currency of the now defunct Rs 500 and Rs 1,000 notes.
Read in English: No ID photocopy needed: RBI
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X