వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిపిస్తే పంపించి వేయండి, దీపావళికి ఏమైనా జరిగితే: యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నడుం కట్టారు. పోలీసులకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నడుం కట్టారు. పోలీసులకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

అక్రమంగా ఉన్న విదేశీయులను గుర్తించాలి

అక్రమంగా ఉన్న విదేశీయులను గుర్తించాలి

రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి వెంటనే వారిని పంపించాలని ఆదేశించారు. చొరబాట్లను నిలువరించేలా ప్రత్యేకంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

గట్టి భద్రత ఏర్పాటు చేయాలని

గట్టి భద్రత ఏర్పాటు చేయాలని

ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో కూడా గట్టి భద్రత ఏర్పాటు చేయాలని, అనుమానితులను తనిఖీ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాపంగా విదేశీయులు ఎంతమంది ఉంటున్నారో అధికారికంగా లెక్కలు తీయాలని, ఎవరు అక్రమంగా ఉంటున్నారో వారిని తప్పనిసరిగా గుర్తించాల్సి ఉందన్నారు.

అలా కనిపిస్తే పంపించివేయాలి

అలా కనిపిస్తే పంపించివేయాలి

అలా కనిపించిన వారిని వెంటనే పంపించివేయాలని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు ఈ రాష్ట్రంలో స్థానం లేదని, వారిని వెంటనే బలగాలు పెట్టించైనా బయటకు పంపించివేయాలని, ఈ పనిని పోలీసులే చేయాలని యోగి ఆదిత్యనాత్ తేల్చి చెప్పారు.

ఈ దీపావళికి జరగరాని సంఘటన జరిగితే

ఈ దీపావళికి జరగరాని సంఘటన జరిగితే

ఈ దీపావళికి జరగరాని సంఘటనలు ఏమైనా జరిగితే మాత్రం సంబంధిత పోలీసులపై మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయని యోగి హెచ్చరించారు. నేరస్తులపై ఓ కన్నేసి ఉంచాలని, రాష్ట్రంలో ఉన్న 3,200 వాహనాలను నిత్యం పెట్రోలింగ్‌కు తిప్పాలనిసూచించారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath has directed police officials to launch a survey to identify foreign nationals staying illegally in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X