వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్ ... కొబ్బరినూనె, పుదీనాతో ఇంట్లో నుండే కరోనా టెస్ట్ .. ఎలాగంటే

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి . ఈ మహమ్మారి విషయంలో తాజాగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ జ్వరానికి ఉన్నట్టే కరోనాకు జ్వరం , తలనొప్పి , జలుబు , దగ్గు వంటి లక్షణాలు ఉంటాయని అందరికీ తెలుసు .అలాగే కరోనా సోకినా వారికి రుచి, వాసన కూడా తెలీవని వైద్య నిపుణులు కరోనా లక్షణాలలో వెల్లడించారు. భారతదేశంలో ఒక అధ్యయనం ప్రకారం, వాసనతో కరోనా తీవ్రతను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కరోనా ఉన్నదో లేదో ఇంట్లోనే గుర్తించేలా ఈ అధ్యయనం సాగింది .

షాకింగ్ .. కరోనా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ .. రెండోసారి చాలా తీవ్రంగా వైరస్ దాడి చేస్తుందన్న రీసెర్చ్షాకింగ్ .. కరోనా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ .. రెండోసారి చాలా తీవ్రంగా వైరస్ దాడి చేస్తుందన్న రీసెర్చ్

ఐదు వాసనల గుర్తింపు... కరోనా ఉందో లేదో ఇంట్లోనే తెలుసుకునే అధ్యయనం

ఐదు వాసనల గుర్తింపు... కరోనా ఉందో లేదో ఇంట్లోనే తెలుసుకునే అధ్యయనం

ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో, పరిశోధకులు రోగులకు 5 ప్రత్యేకమైన వాసనలు చూపించారు . వాటిలో పుదీనా , వెల్లుల్లి, కొబ్బరి నూనె, సోంపు , ఏలకుల వాసనను గుర్తించమని కోరారు. బీబొమ్ యొక్క నివేదిక ప్రకారం, అధ్యయనం యొక్క నిర్వాహకులు పాల్గొనేవారికి మొబైల్ టెస్ట్ కిట్లను తయారు చేశారు. తద్వారా వారు తమ ఇళ్ల నుండి నేరుగా పరీక్ష చేసుకునేలా చేశారు . ఈ అధ్యయనంలో కరోనా ఉన్నవారు కొన్ని వాసనలను అసలే పసిగట్టలేకపోయారు.

పుదీనా, కొబ్బరినూనె వాసనలను గుర్తించలేకపోయిన వారికి కరోనా నిర్ధారణ

పుదీనా, కొబ్బరినూనె వాసనలను గుర్తించలేకపోయిన వారికి కరోనా నిర్ధారణ

పుదీనా , కొబ్బరి నూనె వాసనను గుర్తించలేని వ్యక్తులు ఘోరమైన కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని అధ్యయనం తేల్చింది. పాల్గొన్న వారిలో, దాదాపు 25% మంది పుదీనా వాసనను గుర్తించలేకపోయారని నివేదిక పేర్కొంది. పాల్గొనేవారిలో 21% కొబ్బరి నూనె వాసనను గుర్తించలేకపోయారు. వాండర్‌బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధన బృందం ఈ పరిశోధన నిర్వహించింది. బీబోమ్ నివేదికలో వారు రుచి మరియు వాసన లక్షణం కోల్పోవడం గురించి పరిశోధనా బృందం పేర్కొన్నారు .

సాధారణ జ్వరానికి కూడా రుచి, వాసన తెలీదు .. కానీ కరోనాను గుర్తించటం ఇలా ..

సాధారణ జ్వరానికి కూడా రుచి, వాసన తెలీదు .. కానీ కరోనాను గుర్తించటం ఇలా ..

శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి తరచుగా జలుబు , దగ్గు ఇతర లక్షణాలు ఉంటాయి . ఇవి వ్యక్తులలో వాసన సామర్థ్యాన్ని నిరోధిస్తాయి . కరోనా వైరస్ ప్రభావం ఉంటే ఇది వాసన న్యూరాన్‌లకు నష్టం చేస్తుందని వారు పేర్కొన్నారు . సాధారణ జలుబు లేదా ఫ్లూతో బాధపడుతున్నప్పుడు రుచి, వాసన పై కూడా ప్రభావం పడుతుంది. ఇక అది కరోనానా కాదా తెలుసుకోవాలంటే మాత్రం కొబ్బరి నూనె , పుదీనా వాసన చూస్తే ఇట్టే తెలిసిపోతుందని పరిశోధకులు వెల్లడించారు .

వాసనలతో కరోనా గుర్తింపు ... పలు అధ్యయనాలు

వాసనలతో కరోనా గుర్తింపు ... పలు అధ్యయనాలు

రుచి మరియు వాసన కోల్పోవటం ఒక్క కరోనాతో మాత్రమే కాదు 60 శాతం జలుబు మరియు సైనస్ ఇన్ఫెక్షన్లతో కూడా జరుగుతుంది. కానీ వాసన గుర్తించలేకపోవటాన్ని బట్టి కరోనాను నిర్ధారించవచ్చు అని పేర్కొన్నారు . ముఖ్యంగా కొబ్బరి నూనె , పుదీనా వాసనలను గుర్తించలేకుంటే కరోనా ఉన్నట్టు నిర్ధారించుకోవచ్చు అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయి. కరోనా లక్షణాలపై , కరోనా సోకినా తర్వాత వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ పై కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇక మరోపక్క కరోనా వ్యాక్సిన్ల కోసం శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి .

English summary
In an interesting study, the researchers gave 5 unique odours to patients and asked them to identify the smell that included the smell of mint, garlic, coconut oil, fennel, and cardamom. The persons who didn't identified the coconut oil and mint smell affected with covid .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X