వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం అనుమతిస్తే వినియోగదారులకు బంఫర్ ఆఫర్లు ఇస్తాం

రద్దు చేసిన నగదుతోనే మొబైల్ విక్రయాలు చేసుకొనేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా 50 శాతం మొబైల్ విక్రయాలు పడిపోయాయని అసోసియేష

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా మొబైల్ కంపెనీల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. తమ విక్రయాలను పెంచుకొనేందుకు మొబైల్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే రద్దు చేసిన నగదుతోనే మొబైల్ విక్రయాలు సాగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మొబైల్ కంపెనీలు కోరుతున్నాయి.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా మొబైల్ కంపెనీల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. డిసెంబ్ 30వ, తేది వరకు రద్దు చేసిన పాత నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనే అవకాశం కల్పించింది కేంద్రం. అయితే తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకొనేందుకుగాను ఆయా మొబైల్ కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

if central governament permit, provide bumper offers to consumers

పెద్దనగదు నోట్ల రద్దు కారణంగా సుమారు 50 శాతం మొబైల్ కంపెనీల విక్రయాలు పడిపోయాయి. తమ విక్రయాలను పెంచుకోనేందుకు కంపెనీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. రద్దు చేసిన నగదు నోట్లతోనే మొబైల్ విక్రయాలను సాగించేందుకు అనుమతి ఇవ్వాలని మొబైల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

ఈ మేరకు టెలికం, ఐటి, ఆర్థిక మంత్రిత్వశాఖలకు లేఖలు రాశాయి,.గుర్తింపు కార్డులున్నవారికి మాత్రమే మొబైల్ ఫోన్లను విక్రయించనున్నట్టు కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డుల ఆధారంగానే ఫోన్ల విక్రయాలు జరుపుతామని చెప్పాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ ( ఐఎంఈఐ )నెంబర్ ఉన్న ఫోన్లను మాత్రమే విక్రయిస్తామని చెప్పాయి.

ఈ ప్రతిపాదనపై కేంద్రం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మొబైల్ విక్రయాలు జోరందుకొనే అవకాశం ఉంటుందని మొబైల్ కంపెనీలు అభిప్రాయంతో ఉన్నాయి. ఈ విషయమై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది.

English summary
please permit for purchasing mobile phones with banned currency notes indian celluar association reprentation to cenral governament. mobiles sales decrease 50 percentage because of currency ban.if governament permit mobile sales with banned currency, sales will be increased said association.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X