వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ అమ్మాయిని టచ్ చేస్తే ఆ హ్యాండ్ కట్, తాజ్ మహల్ కట్టింది ఎవరంటే, కేంద్ర మంత్రి హెగ్డే !

|
Google Oneindia TeluguNews

మడికేరి/ బెంగళూరు: ప్రతినిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. హిందూ అమ్మాయిలను వేరే మతం వారు టచ్ చేస్తే ఆ చెయ్యి ఫినిష్ చేస్తాం అంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చెప్పడంతో మళ్లీ దూమరం రేగింది. తాజ్ మహల్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కొడుగు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఉత్తర కన్నడ జిల్లా ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ మనం మన సమాజంలో మతం గురించి ఆలోచించాలి, జాతి గురించి ఆలోచించాలని అన్నారు. సమాజంలో ఇతర మతస్తులు ఒక్క హిందూ యువతిని లేదా మహిళను టచ్ చేస్తే ఆ చెయ్యిని ఏం చెయ్యాలో మాకు బాగాతెలుసు అంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ప్రజలను రెచ్చగొట్టే విదంగా వ్యాఖ్యలు చేశారు.

If a hand touches a Hindu girl union ministers Ananth Kumar Hegde new controversy

తాజ్ మహల్ ను కట్టింది ముస్లీంలు కాదని, ఈ విషయం చరిత్ర చెబుతోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆరోపించారు. షాజహన్ తన ఆత్మకథలో తాజ్ మహల్ ను తాను రాజా జయసింహా నుంచి తీసుకున్నానని రాసుకున్నారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చెప్పారు.

తాజ్ మహల్ ను రాజా పరమతీర్థ నిర్మించిన శివుడి దేవాలయం అని, తేజో మహల్ అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. అయితే తేజో మహల్ నేడు తాజ్ మహల్ అయ్యిందని, ఈ విషయం తెలిసి మాకు ఎలా నిద్ర వస్తుందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. మా ఇళ్లను మంజిల్ అంటున్నారు, రాముడు షాజహాన్ అయితే సీత బీబీ అవుతుందా అంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

English summary
Karnataka: Union minister Ananth Kumar Hegde said, We have to rethink about priorities of our society. We shouldn't think of caste. If a Hindu girl is touched by a hand, then that hand should not exist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X