వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవాల్: అక్రమ ఆస్తులు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా, కాంగ్రెస్ లేడీ ఎమ్మెల్యే లక్ష్మి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తాను అక్రమంగా ఆస్తులు సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే ఆ అస్తులను ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుల్లో ఒకరైన లక్ష్మి హెబ్బాళ్కర్ తన మీద ఆరోపణలు చేస్తున్న వారికి సవాలు విసిరారు.

ఏం పోయేకాలం: అర్దరాత్రి మహిళను నడిరోడ్డులో వదిలేసిన ఓలా క్యాబ్ డ్రైవర్!ఏం పోయేకాలం: అర్దరాత్రి మహిళను నడిరోడ్డులో వదిలేసిన ఓలా క్యాబ్ డ్రైవర్!

ఈడీ నోటీసులు

ఈడీ నోటీసులు

అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు లక్ష్మి హెబ్బాళ్కర్ ఇటీవల నోటీసులు జారీ చేసిందని ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈడీ అధికారులు లక్ష్మి హెబ్బాళ్కర్ ను ఢిల్లీకి పిలిపించి విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈడీ అధికారులు విచారణ చేసిన విషయంపై లక్ష్మి హెబ్బాళ్కర్ స్పందించారు.

సీబీఐకి కేసు ?

సీబీఐకి కేసు ?

చాముండీదేవి మీద ప్రమాణం చేస్తున్నా, తాను అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ అన్నారు. తాను అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని, తన మీద ఈడీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు అనే విషయం తనకు తెలీదని లక్ష్మి హెబ్బాళ్కర్ చెప్పారు.

ఐటీ అధికారులు

ఐటీ అధికారులు

హర్ష షుగర్స్ కంపెనీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆ కంపెనీ లావాదేవీల రికార్డులను ఇప్పటికే ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారని లక్ష్మి హెబ్బాళ్కర్ వివరించారు.

చట్టపరంగా బ్యాంక్ లోన్

చట్టపరంగా బ్యాంక్ లోన్

తమకూరు డీసీసీ బ్యాంకులో లోను తీసుకున్న విషయంపై మాట్లాడిన లక్ష్మి హెబ్బాళ్కర్ అన్నీ చట్టపరంగా జరిగాయని, తన ఆస్తులు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నామని, ఎక్కడా ఎలాంటి మోసం చెయ్యలేదని లక్ష్మి హెబ్బాళ్కర్ అన్నారు.

బెస్ట్ క్రషింగ్ అవార్డు

బెస్ట్ క్రషింగ్ అవార్డు

హర్ష షుగర్స్ ఈసారి బెస్ట్ క్రషింగ్ అవార్డు సొంతం చేసుకుందని, రైతుల ప్రయోజనాల కోసం ఆ కంపెనీ పని చేస్తుందని అన్నారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే వెంటనే ఆ ఆస్తులు ప్రభుత్వానికి రాసివ్వడానికి సిద్దంగా ఉన్నానని లక్ష్మీ హెబ్బాళ్కర్ చెప్పారు.

English summary
Belagavi: If I make illegal money, I will return it all to the government said Lakshmi Hebbalkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X