వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో చివరి రోజు పోటాపోటీ ప్రచారం... మమత‌ నియంతృత్వంపై మోడీ ఆగ్రహం..

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : ప్రధాని నరేంద్రమోడీ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దీదీపై నిప్పులు చెరిగారు. సాయంత్రం ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగాల్ వెళ్తున్నానన్న మోడీ... మమత తన హెలికాప్టర్‌ ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. దీదీ తన సహజ ధోరణిని ప్రదర్శిస్తే డుమ్ డుమ్‌లో తన హెలికాప్టర్ దిగేందుకు అనుమతించరని విమర్శించారు..

ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్స్ ఛేంజ్.. టీఎంసీ నేతల వింత నిరసనఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్స్ ఛేంజ్.. టీఎంసీ నేతల వింత నిరసన

ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ రెండు బహిరంగ సభల్లో పాల్గొననుండగా.. ఆయనతో ఢీ అంటే ఢీ అంటున్న మమత బెనర్జీ నాలుగు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

If Mamata has her way she will not allow helicopter to land : Modi

బెంగాల్‌లో ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాని మోడీ మధురాపూర్, డుమ్‌డుమ్‌లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం మమతాబెనర్జీ నార్త్ 24 పరిగణాలు, డైమండ్ హార్బర్‌లో జరిగే ర్యాలీలతో పాటు సౌత్ వెస్ట్ పరిగణాలు, కోల్‌కతాలో రోడ్ షోల్లో పాల్గొననున్నారు. నార్త్ పరిగణాలో సభలో పాల్గొన్న తర్వాత డైమండ్ హార్బర్ చేరుకోనున్న మమత అనంతరం సౌత్ వెస్ట్ పరిగణాలు, కోల్‌కతాలో ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు మోడీ సాయంత్రం నాలుగున్నరకు మధురాపూర్, ఆరింటికి డుమ్ డుమ్‌లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.

English summary
Modi said Mamata has her way she will not allow helicopter to land. "I am going to West Bengal for rally in Dum Dum. Let us see if Didi allows it. If she has her way she will not allow helicopter to land," says PM Modi at a rally in Uttar Pradesh's Mau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X