• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మసీదును కూల్చడంవల్లే మందిరం - ఇక ఈ ఎపిసొడ్‌ను మర్చిపోవాలి - శివసేన సంచలన కామెంట్లు

|

దేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘట్టంగా భావించే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులకు సంబంధించి లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు చెప్పింది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సహా మొత్తం 30 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిజానికి ఈ నిందితులందరూ.. మసీదు విధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కూల్చివేతకు వీళ్లే కుట్రదారులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని జడ్జి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పుపై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వెలువడుతున్నాయి.

తీర్పుపై అద్వానీ అనూహ్య రియాక్షన్ - బీజేపీ నేత ఇంటి వద్ద భారీ హడావుడి - ఈ ఐదు పాయింట్లే కీలకం తీర్పుపై అద్వానీ అనూహ్య రియాక్షన్ - బీజేపీ నేత ఇంటి వద్ద భారీ హడావుడి - ఈ ఐదు పాయింట్లే కీలకం

సంఘ్ పరివార్ కాకున్నా..

సంఘ్ పరివార్ కాకున్నా..

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మభూమి వద్ద 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చేసిన ఘటనకు సంబంధించిన కేసుల్లో బీజేపీ, వీహెచ్‌పీ లాంటి సంఘ్ పరివార్ విభాగాలకు చెందిన నేతలతోపాటు శివసేన లీడర్ల పేర్లూ ప్రముఖంగా ఉన్నాయి. సంఘ్ పరివార్ లో భాగం కానప్పటికీ, మందిర ఉద్యమంలో శివసేన కీలక పాత్ర పోషించింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఇప్పటికే కన్నుమూయడంతో కేసు నుంచి ఆయన పేరును తప్పించారు. ఇవాళ నిర్దోషులుగా తేలిన 32 మందిలో శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్ కూడా ఉన్నారు. బీజేపీతోకలిసి సుదీర్ఘకాలం ప్రయాణించిన శివసేన.. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న దరిమిలా బాబ్రీ కేసుపై సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుపై శివసేన భిన్నంగా స్పందించడం గమనార్హం.

అది జరగబట్టే మందిరం..

అది జరగబట్టే మందిరం..


‘‘అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేయడం వల్లే ఇవాళ మందిర నిర్మాణం కల సాకారం అయింది. అయితే, కూల్చివేతలో కుట్ర కోణం లేదని, పరిస్థితుల ప్రభావం వల్లే జరిగిందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. నిజానికి ఇది ఊహించిన తీర్పే. ఇక ఈ ఎపిసొడ్ ను మనమంతా మర్చిపోతే మంచిది. నిర్దోషులుగా బయటపడిన అద్వానీ, జోషి, ఉమా భారతి సహా అందరికీ శివసేన తరఫున శుభాకాంక్షలు చెబుతున్నాం'' అని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని బాబ్రీ కేసులో నిర్దోషిగా తేలిన శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్ అన్నారు.

న్యాయవ్యవస్థకే సిగ్గుచేటు

న్యాయవ్యవస్థకే సిగ్గుచేటు


‘‘అయోధ్య భూవివాదంపై తీర్పు సందర్భంగా నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. దాన్నొక అసాధారణ పరిణామంగా అభివర్ణించారు. అలాంటిది, ఇవాళ్టి సీబీఐ కోర్టు తీర్పు.. న్యాయవ్యవస్థకే సిగ్గుచేటులా ఉంది. నేరపూరిత కుట్ర ఆరోపితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడం స్వీయ ప్రేరితం కాదా? ఇది ముమ్మాటికీ న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే'' అని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు.

English summary
If the Babri Masjid wasn't demolished we wouldn't have seen any Bhumi Pujan for Ram Mandir, says Shiv Sena mp Sanjay Raut. CPI(M)'s Sitaram Yechury called the verdict a travesty of justice. “A complete travesty of Justice. A special CBI court on Wednesday acquitted all 32 accused, including BJP veterans LK Advani, MM Joshi and Uma Bharti, of criminal conspiracy charges around 28 years after Babri Masjid was demolished in Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X