వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మాయావతికి పోటీగా ఆ సెక్స్ బాంబ్ ఢీ !

|
Google Oneindia TeluguNews

అలహాబాద్: ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ చీఫ్ మాయావతికి పోటీగా సినీనటి 'సెక్స్ బాంబ్'రాఖీ సావంత్ ను బరిలో నిలబెడుతామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పీఐ) ప్రకటించింది.

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే అలహాబాద్ లో ఈ విషాయన్ని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది (2017) ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

దళితుల సంపూర్ణ మద్దతు ఉన్న ఆర్ పీఐ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. అయితే పొత్తు కుదరని పక్షంలో 200 శాసన సభ నియోజక వర్గాల్లో మేమే సొంతంగా అభ్యర్థులను పోటీలో పెడుతామని అన్నారు.

If Mayawati contests, will filed Rakhi Sawant against her: RPI chief

మాయావతి కొంత కాలంగా ఎన్నికలను తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. మాయావతి ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆమె ఒకవేళ మనసు మార్చుకుని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే మా సత్తా చూపిస్తామని రామ్ దాస్ అథవాలే అన్నారు.

మాయావతికి పోటీగా ఆర్ పీఐ మహిళా విభాగం అధ్యక్షురాలు రాఖీ సావంత్ ను పోటీలో నిలబెడుతామని, మాయావతిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని చాలెంజ్ చేశారు. మాయావతి ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడే రాఖీ సావంత్ ను బరిలో నిలబెడుతామని అన్నారు.

2012 ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన మాయావతి ఓటమిపాలైనారు. తరువాత ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైనారు. వచ్చ ఏడాది జరిగే శాసన సభ ఎన్నికల్లో మాయావతి ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే అక్కడ రాఖీ సావంత్ బరిలో ఉంటారని ఆర్ పీఐ అధ్యక్షుడు రామ్ దాస్ అథవాలే చెప్పారు. మొత్తం మీద సెక్స్ బాంబ్ ను వచ్చే ఏడాది ఎంఎల్ఏని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
we would field Rakhi Sawant who is our women’s wing president, from the very seat the BSP chief chooses for herself, Ramdas Athawale told reporters in Allahabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X