వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో బీజేపీ హవా! జేడీయూ డీలా: ఎన్డీఏ గెలిస్తే సీఎం నితీశే అవుతారా?, మోడీ పార్టీ మాటేంటి?

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మొదట ఎన్డీఏ, ఆ తర్వాత ఆర్జేడీ మహాకూటమి.. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆధిక్యాన్ని చాటుకుంటోంది. ఎన్డీఏ కూటమిలో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Super: బీహార్ సీఎం తేజస్వీ యాదవ్, ఓరి పిచ్చోడా, ఎవడిగోళవాడిది, లీడర్ ఏం చెప్పారు ? వీళ్లు ఏం చేశారు!Super: బీహార్ సీఎం తేజస్వీ యాదవ్, ఓరి పిచ్చోడా, ఎవడిగోళవాడిది, లీడర్ ఏం చెప్పారు ? వీళ్లు ఏం చేశారు!

మేజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ..

మేజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ..

ప్రస్తుతం ఫలితాలను పరిశీలిస్తే.. ఎన్డీఏ కూటమి 130 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే దాదాపు మేజిక్ ఫిగర్ చేరుకుందన్నమాట. అటు మహాకూటమి కూడా 102 చోట్ల ఆధిక్యంతో ఎన్డీఏకు తీవ్ర పోటీ ఇస్తోంది. అయితే, 27 స్థానాల్లో ప్రధాన అభ్యర్థుల మధ్య తేడా కేవలం 500 నుంచి 1000 ఓట్ల లోపు మాత్రమే తేడా ఉండటంతో ఆధిక్యాలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి.

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ..

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ..

బీజేపీ ఈ ఎన్నికల ఫలితాల్లో 72కుపైగా స్థానాల్లో ఆధిక్యం చాటుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించడం గమనార్హం. ఎన్డీఏ కూటమిలో జేడీయూ రెండో స్థానానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఒక వేళ బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినా జేడీయూ నేత నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనేది ఇప్పుడు సందేహంగా మారింది.

జేడీయూ మూడోస్థానం.. సీఎం నితీశేనా?

జేడీయూ మూడోస్థానం.. సీఎం నితీశేనా?

గతంలో పోలిస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ ప్రదర్శన చెప్పుకోదగిన విధంగా లేదు. ఆధిక్యంలో చూస్తే బీజేపీ తర్వాత ఆర్జేడీ ఉండగా.. జేడీయూ మూడో స్థానానికి పడిపోయింది. దీంతో ఎన్డీఏ కూటమి గెలిస్తే నితీష్ కుమార్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారా? లేదా అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి.

సీఎం నితీష్.. బీజేపీ ఏమంటోంది..?

సీఎం నితీష్.. బీజేపీ ఏమంటోంది..?

ఇందుకు ఓ బీజేపీ నేత వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ‘ఈ ఎన్నిక ద్వారా మోడీ ఇమేజ్ మాకు కలిసివచ్చింది' అని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా అన్నారు. అంతేగాక, ‘సాయంత్రం నాటికి, ప్రభుత్వ ఏర్పాటు, నాయకత్వ సమస్యలపై మేము నిర్ణయిస్తాము' అని ఆయన మీడియాతో పేర్కొనడం గమనార్హం. అయితే, మరో బీజేపీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. నితీశ్ మళ్లీ సీఎం అవుతారని అన్నారు. ఎన్డీఏ గెలుపు ఖాయమని, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Nitish Kumar's dream of returning as Chief Minister of Bihar now appears to depend entirely on the largesse of his ally, the BJP. At 11.30 am, the party had the most seats in Bihar, where votes are still being counted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X