వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ శివసేనకు థ్యాంక్స్ చెప్పాలి... బీజేపీ మహారాష్ట్ర దెబ్బ మరువదు... సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..

|
Google Oneindia TeluguNews

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ చతికిలపడటంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీహార్‌లో 125 స్థానాల్లో ఆధిక్యంతో... బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తోంది. ఇదే ట్రెండ్ చివరి వరకూ కొనసాగితే ఎన్డీయే చేతికి పగ్గాలు వెళ్లడం లాంఛనమే. అయితే బీజేపీ తన మాటను నిలబెట్టుకుని నితీశ్‌నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందా..? లేక నితీశ్‌ను పక్కనపెట్టి సొంత పార్టీ అభ్యర్థిని సీఎం చేస్తుందా...? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే అంశంపై మహారాష్ట్ర శివసేన నేత సంజయ్ రౌత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంజయ్ రౌత్ ఏమన్నారు...

సంజయ్ రౌత్ ఏమన్నారు...

బీహార్‌లో బీజేపీ నితీశ్ కుమార్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తుందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అందుకు నితీశ్ కుమార్‌ శివసేనకు థ్యాంక్స్ కూడా చెప్పాలన్నారు. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలు బీజేపీకి ఇప్పటికీ గుర్తున్నాయని... కాబట్టి నితీశ్‌ను పక్కనపెట్టే సాహసం ఆ ఆ పార్టీ చేయబోదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తే నితీశ్‌తో ఆ పార్టీకి పెద్దగా అవసరం ఉండదు కాబట్టి... ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.

మహారాష్ట్ర సీన్‌ని గుర్తుచేసిన రౌత్...

మహారాష్ట్ర సీన్‌ని గుర్తుచేసిన రౌత్...

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ... 'నితీశ్ బాబే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ నేతలు చెప్తున్నట్లు నాకు తెలిసింది. అందుకు నితీశ్ శివసేనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే... ఎన్నికల ఫలితాల తర్వాత ఇష్టారీతిన వ్యవహరిస్తే ఏం జరుగుతుందో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బీజేపీకి రుచి చూపించింది.' అని వ్యాఖ్యానించారు. కాబట్టి అలాంటి తప్పిదమే బీజేపీ మళ్లీ బిహార్‌లోనూ చేయబోదని... తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీశే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఏం జరిగింది...

మహారాష్ట్రలో ఏం జరిగింది...

గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల తర్వాత సీఎం కుర్చీ విషయంలో విభేదాలు తలెత్తడంతో పొత్తు విచ్చిన్నమైంది. దీంతో శివసేన.. నేషనల్ కాంగ్రెస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌నే ముందుపెట్టి బీజేపీ బరిలో దిగింది. అయితే ఎన్నికల్లో నితీశ్ పార్టీ జేడీయూ చతికిలపడటంతో... బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి నితీశ్‌నే సీఎం కుర్చీలో కూర్చోబెడుతుందా... లేక సొంత పార్టీ నేతను సీఎం చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.

Recommended Video

Counting of votes for 58 Assembly by-polls across 11 states
తాజా ట్రెండ్స్...

తాజా ట్రెండ్స్...


ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయే 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ నేత్రుత్వంలోని మహాకూటమి 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాత్రి 9గంటల వరకు దాదాపు 90శాతం ఓట్లను లెక్కించినట్లు ఈసీ ప్రకటించింది. మరో 10శాతం ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి లోపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. చాలాచోట్ల బీజేపీ చాలా తక్కువ ఓట్లతో ఆధిక్యంలో ఉండటంతో... తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

English summary
The Shiv Sena on Tuesday said JD-U leader Nitish Kumar should thank it if he retains the post of Bihar chief minister despite his party winning less seats in the Assembly polls than ally BJP as the latest trends indicate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X