వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ చుట్టూ భజన బ్యాచ్, మొదటికే మోసం, 31 శాతం అధికారం పోయింది, బీజేపీ ఎంపీ స్వామి ఫైర్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: ఒకే సంవత్సరంలో ఐదు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, లేదంటే మొదటికే మోసం వస్తోందని సోంత పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చుట్టు భజన బ్యాచ్ చేరిందని, ఆర్థిక రంగం, దేశ అభివృద్ది విషయంలో ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే బీజేపీ ముందుకు వెళితే బీజేపీ ముక్త భారత్ అవుతోందని ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రమణియన్ స్వామి పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పటికే దేశంలో 31 శాతం అధికారానికి బీజేపీ దూరం అయ్యిందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి విచారం వ్యక్తం చేశారు.

ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!

జార్ఖండ్ దెబ్బతో హడల్ !

జార్ఖండ్ దెబ్బతో హడల్ !

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలకు చాన్స్ ఇస్తారా ?

ప్రతిపక్షాలకు చాన్స్ ఇస్తారా ?

భారతదేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే మనం ప్రతిపక్షాలు విమర్శించడానికి చాన్స్ ఇచ్చినవాళ్లం అవుతామని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు.

ప్రధాని మోదీ చుట్టూ భజన బ్యాచ్

ప్రధాని మోదీ చుట్టూ భజన బ్యాచ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారుల విషయంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారుల గురించి తనకు పెద్దగా తెలీదని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ భజన బ్యాచ్ ఎక్కువ అయ్యిందని, ఆయనకు ఆర్థిక పరిస్థితి గురించి క్షుణ్ణంగా వివరించకుండా దేశ అభివృద్ది విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మండిపడుతున్నారు.

ఒక్క ఏడాదిలో భారీ దెబ్బలు

ఒక్క ఏడాదిలో భారీ దెబ్బలు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ నాయకులు అయోమయంలో పడిపోయారు. జార్ఖండ్ లో అధికారం కోల్పోయిన తరువాత బీజేపీ నాయకులు సైతం ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. 2018 నుంచి 2019 మధ్య కాలంలో దేశంలో బీజేపీ దాదాపుగా 31 శాతం అధికారం కోల్పోయిందని బీజేపీ నాయకులే అంటున్నారు.

English summary
After the Jharkhand Assembly Lost, BJP Leader Subramanian Swamy said the way for a BJP free India if the economy of the country is not rectified and the economy is not deteriorating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X