వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీని గాడ్సే చంపకపోయుంటే నేనే చంపేదాన్ని: పూజా శకున్ పాండే వివాదాస్పదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని గాడ్సే చంపకుంటే.. తానే చంపేదాన్నంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం) ఆధ్వర్యంలో దేశంలోనే తొలి హిందూ కోర్టును ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు.

ఆ కోర్టుకు పూజా శకున్ పాండేను జడ్జీగా నియమించారు. ఈ క్రమంలో పూజా శకున్ పాండే ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. గాంధీని నాథూరామ్ గాడ్సే చంపకుండా ఉండి.. ఆ సమయంలో తాను పుట్టివుంటే తానే గాంధీని చంపేదాన్నని అన్నారు.

If not Godse, I would have killed Gandhi, says judge of self-styled Hindu court

'నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే.. అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు. నాథూరామ్ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తాను' అని పూజ వ్యాఖ్యానించారు.

'గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు. అందరూ అసలు చరిత్ర చదవాలి' అని ఆమె అన్నారు. గతంలో కూడా పూజ.. ట్రిపుల్ తలాక్ పేరుతో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూ ధర్మాన్ని అనుసరించాలంటూ వ్యాఖ్యానించారు.

English summary
Akhil Bharat Hindu Mahasabha (ABHM) has set up the first self-styled Hindu court of the country in Uttar Pradesh's Meerut. However, it is not the establishment of the self-proclaimed court that has hit the headlines but the comments made by the judge appointed at the court. "If Godse had not killed Gandhi, I would have done it," said Pooja Shakun Pandey the judge at the Hindu court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X