వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ అనుసంధానానికి మార్చి 31 డెడ్‌లైన్: ఆ తర్వాత మీ పాన్ పనిచేయదు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మార్చి 31, 2020లోపు పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోకుంటే.. ఇక మీ పాన్ కార్డు పనిచేయదు. ఎందుకంటే మార్చి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులను పని చేయనివిగా పరిగణిస్తామని ఆదాయపుపన్ను శాఖ తాజాగా స్పష్టం చేసింది.

ఇప్పటి ఈ గడువును చాలా సార్లు పెంచామని, ఈ మార్చి లోగా అనుసంధానం చేసుకోని కార్డులను పనిచేయనివిగా గుర్తిస్తామని తేల్చేసింది. అనుసంధానం కోసం ఎన్నోసార్లు అవకాశం కల్పించినప్పటికీ ఇంకా సుమారు 17 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదని వెల్లడించింది.

ve after March 31

2017 జులై ఒకటి ముందు జారీయైన కార్డులను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ఐటీశాఖ సూచించింది. లేదంటే సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం పాన్ కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) స్పష్టం చేసింది.

పాన్ కార్డుదారులు ఆధార్ నెంబర్ తెలియజేయకుంటే ఆదాయపుపన్ను చట్టం ప్రకారం తదనంతర పర్యవసానాలకు బాధ్యులు వారేనని పేర్కొంది. కాగా, https://www.incometaxindiaefiling.gov.in/home ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎడమవైపున ఉన్న లింక్ ఆధార్‌పై క్లిక్ చేసి ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.

English summary
The Income Tax department says your PAN will become inoperative if you don't link it with Aadhaar by March 31, 2020, according to a PTI report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X