వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి అభ్యర్థిగా స్వామినాథన్.. కొత్త పేరు సూచించిన శివసేన

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పదవికి ఎన్డీయే తరఫున అభ్యర్థిని నిలబెట్టే విషయంలో బీజేపీ మిత్రపక్షం శివసేన మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పదవికి ఎన్డీయే తరఫున అభ్యర్థిని నిలబెట్టే విషయంలో బీజేపీ మిత్రపక్షం శివసేన మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చింది.

ఇంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేరును సూచించిన శివసేన.. తాజాగా ఆ పదవికి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ పేరును సూచించింది.

భగవత్‌ అభ్యర్థిత్వానికి బీజేపీ ఒప్పుకోకపోతే స్వామినాథన్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సూచించనున్నారని పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు.

If not Mohan Bhagwat then MS Swaminathan as President: Shiv Sena

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించి విపక్షాల ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.

రాష్ట్రపతిఎన్నికల గురించి వారు ఆమెతో చర్చించారు. అంతకుముందు ఇదే విషయమై ఎన్సీపీ, తెలుగుదేశం పార్టీ అధినేతలు శరద్‌పవార్‌, చంద్రబాబు నాయుడుతో కూడా వెంకయ్యనాయుడు చర్చించారు.

English summary
The Shiv Sena today said that it would propose the name of MS Swaminathan as the presidential candidate for the coming presidential elections. The party’s chief said that if Bhartiya Janata Party (BJP) does not consider the name of RSS chief Mohan Bhagwat for the presidentship, then they would propose Swaminathan for the same. Swaminathan’s name has not been circulated in the BJP circles as a presidential candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X