వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల రోజుల తర్వాత భార్యతో భోజనం: ఫ్యామిలీ గొడవలపై అఖిలేష్

తమ కుటుంబంలో చోటుచేసుకొన్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఈ బాదను మాటల్లో వర్ణించలేనన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:గత ఏడాది తమ కుటుంబంలో చోటుచేసుకొన్న పరిణామాలతో తీవ్రంగా కలత చెందానని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. అయితే ఈ బాధను మాటల్లో చెప్పలేనన్నారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలిచివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొని బాద పడ్డారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 11వ, తేదిన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , ఆయన సతీమణి డింపుల్ యాదవ్ లు తమ ఇంట్లో సేద తీరుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి తమ పార్టీ విజయం సాధిస్తోందనే ధీమాను అఖిలేష్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు.అయితే బిజెపి నాయకులు తమ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందనే కారణంగానే ప్రధానమంత్రి మోడీని వారణాసిలో ప్రచారం చేయించారని అఖిలేష్ చెప్పారు.

వారణాసిలో ప్రధానమంత్రి మోడీ ప్రచారం చేయకపోతే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేదని అఖిలేష్ అభిప్రాయపడ్డారు.అయితే ఈ దఫా ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లు పాజిటివ్ ఓటును సమాజ్ వాదీ పార్టీకి వేయనున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

కుటుంబంలో గొడవలతో తీవ్రంగా కలత చెందాను

కుటుంబంలో గొడవలతో తీవ్రంగా కలత చెందాను

గత ఏడాది తమ కుటుంబంలో చోటుచేసుకొన్న పరిణామాలతో తాను తీవ్రంగా కలత చెందానని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఈ విషయమై తాను ఎంతో మదనపడ్డానని అఖిలేష్ చెప్పారు. ఆ పరిస్థితి అత్యంత బాధకరమైందని ఆయన గుర్తు చేసుకొన్నారు.అయితే అన్ని పరిస్థితులను అధిగమించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ పరిస్థితి ఎంత బాధకరమైందో చెప్పేందుకు తనకు నోట మాట రావడం లేదన్నారు అఖిలేష్ .

కుటుంబంలో గొడవపై కథను చెప్పిన అఖిలేష్

కుటుంబంలో గొడవపై కథను చెప్పిన అఖిలేష్

గత ఏడాది కుటుంబంలో చోటుచేసుకొన్న పరిణామాలపై అఖిలేష్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా బాధించాయన్నారు.అయితే ఈ విషయమై ఓ కథను ఆయన చెప్పారు. ఓ సారి రామకృష్ణ పరమహంసను వివేకానుందుడు దేవుడిని చూపించమని అడిగాడు.అయితే దాంతో ఆయన వివేకానందుడిని గట్టిగా గిల్లాడు.ఏమైందని వివేకానందుడిని రామకృష్ణ పరమహంస ప్రశ్నించాడు. అయితే నొప్పిగా ఉందని వివేకానందుడు బదులిచ్చాడు.అయితే నొప్పి చూపించాలని రామకృష్ణ పరమహంస కోరగా వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. అలాగే మా ఇంట్లో పరిస్థితి కూడ అలానే ఉందని అఖిలేష్ చెప్పాడు.

మోడీ లేకపోతే బిజెపి తుడిచిపెట్టుకుపోయేది

మోడీ లేకపోతే బిజెపి తుడిచిపెట్టుకుపోయేది

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ ప్రచారం చేయకపోతే ఆ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకు పోయేదని ఆయన అభిప్రాయపడ్డారు.వారణాసిలో ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రులంతా ప్రచారం నిర్వహించారని ఆయన గుర్తుచేశారు.తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల ముందు బిజెపి నిలువలేకపోయిందన్నారు.అందుకే ప్రధానమంత్రి మోడీని రంగంలోకి దింపిందన్నారు అఖిలేష్.మోడీ ప్రచారంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందన్నారు.

నెల రోజుల తర్వాత భార్యతో కలిసి అఖిలేష్ భోజనం

నెల రోజుల తర్వాత భార్యతో కలిసి అఖిలేష్ భోజనం

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ప్రచార బాధ్యతలను అఖిలేష్ తన భుజాన వేసుకొన్నారు.దీంతో ఆయన ప్రతి రోజు కనీసం 7 బహిరంగ సభల్లో పాల్గొనేవారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే ఆయన విపరీతంగా పర్యటనలు చేస్తుండేవారు.అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత అఖిలేష్ మరింత వేగం పెంచారు.నెల రోజుల పాటు బిజి బిజీగానే అఖిలేష్ ఎన్నికల ప్రచారంలో గడిపారు.నెలరోజుల తర్వాత భార్య డింపుల్ తో కలిసి మంగళవారం నాడు ఆయన భోజనం చేశారు. ఎన్నికల షెడ్యూల్ కారణంగా భార్యభర్తలు కలిసి భోజనం చేసిన సందర్భాలు ఈ నెల రోజుల్లో లేనేలేవంటే అతిశయోక్తి కానేకాదు.

వారం రోజులు కష్టపడ్డాను

వారం రోజులు కష్టపడ్డాను

ఈ దఫా ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ కూడ ప్రచారం చేశారు.అయితే తొలుత వారం రోజుల పాటు తాను తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని డింపుల్ యాదవ్ చెప్పారు.అయితే క్రమంగా సమస్యలన్నీ అధిగమించినట్టు ఆమె చెప్పారు.అయితే గత ఏడాది కుటుంబంలో చోటుచేసుకొన్న పరిణామాలపై అఖిలేష్ జోక్యం చేసుకొన్నారు. ఈ గొడవలు కుటుంబంలో తమను కలిచివేశాయని చెప్పారు.అయితే అఖిలేష్ ప్రవేశపెట్టిన పథకాల గురించి అడిగి వాటిని ప్రసంగంలో చెప్పాలని తనకు సూచించాడని డింపుల్ చెప్పారు.అయితే తమ ప్రచార టీమ్ సభ్యుడి సూచన మేరకు తాను బోజ్ పూరి వ్యాక్యాలు అజం ఘర్ సభలో ప్రస్తావిస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.తాను గొప్ప వక్త కాదని, అఖిలేష్ మాత్రం ఇంట్లో బయట ఒకేరకంగా ఉంటాడని ఆమె చెప్పారు.అఖిలేష్ తాను చేసిన పథకాల గురించి ప్రస్తావిస్తాడని చెప్పారామె.

తొలి సారి పాజిటివ్ ఓటు

తొలి సారి పాజిటివ్ ఓటు

ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లు తొలిసారిగా పాజిటివ్ ఓటు వేశారని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ఆయన తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను చూసి ప్రజలు తమ పార్టీకి పాటిజివ్ ఓటు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. పాజిటివ్ ఓటు ద్వారానే తాము మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

English summary
The hurly burly of campaigning is over. Samajwadi Party chief and UP CM Akhilesh Yadav has just come back from Ambedkar Nagar after addressing a rally for the by-election to Alapur constituency be held on Thursday and has addressed a press conference in Lucknow. After days of hectic campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X