• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నోటా గెలిస్తే ఎన్నిక రద్దు- కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు- ఏపీ హైకోర్టులోనూ కీలక పిటిషన్

|

ఎన్నికల్లో నోటా వాడకాన్ని ప్రవేశపెట్టిన ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా వీటిపై ధర్మసందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టుతో పాటు ఏపీ హైకోర్టులోనూ వీటిపై దాఖలైన రెండు పిటిషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సదరు ఎన్నికను రద్దు చేయాలా వద్దా అనే విషయంలో తమ అభిప్రాయాలు వెల్లడించాని కేంద్రం, కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఒక్క అభ్యర్ధి బరిలో ఉన్నా నోటా వాడకాన్ని తప్పనిసరి చేయాలంటూ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

సోషల్‌ మీడియా, ఓటీటీల కొత్త మార్గదర్శకాలపై సుప్రీం ఫైర్‌- కఠిన చట్టాలకు కేంద్రం హామీసోషల్‌ మీడియా, ఓటీటీల కొత్త మార్గదర్శకాలపై సుప్రీం ఫైర్‌- కఠిన చట్టాలకు కేంద్రం హామీ

నోటా వాడకంపై కొత్త చర్చలు

నోటా వాడకంపై కొత్త చర్చలు

ఎనిమిదేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ ఉంచేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీని ప్రకారం ఆయా ఎన్నికల్లో అభ్యర్ధుల పేర్లు, గుర్తులతో పాటు నోటాను కూడా ఓ ఆప్షన్‌గా ఉంచుతారు. అంటే పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా ఆప్షన్‌కు ఓటేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు చోట్ల దీన్ని విస్తృతంగా వాడుతున్నారు కూడా. చాలా ఎన్నికల్లో అభ్యర్ధులు సాధించిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తున్న పరిస్దితి. దీంతో సుప్రీంకోర్టులోనూ దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అభ్యర్ధుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు కోరారు.

కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు

కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు


ఏదైనా ఎన్నికలో అభ్యర్ధులు సాధించిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సదరు ఎన్నికను రద్దు చేయాలన్న పిటిషన్లపై తమ అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీం ఛీఫ్ జస్టిస్‌ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

 నోటా పిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నోటా పిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్నికల్లో అభ్యర్ధులు సాధించిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సదరు ఎన్నికను రద్దు చేయాలన్న నిర్ణయం కీలకమైనదే అయినప్పటికీ దీని ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ తరఫు వాదించిన మరో లాయర్‌ మేనకా గురుస్వామి.. నోటా గురించి వాదిస్తూ ఈ ఆప్షన్ వచ్చాక కూడా పార్టీలు మచ్చలేని అభ్యర్ధులను బరిలో నిలిపే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దీంతో ఎన్నికలపై నోటా ప్రభావం లేకుండా పోతోందన్నారు. ఓటర్లు అభ్యర్ధులను తిరస్కరించి నోటాకు ఎక్కువ ఓట్లు వేసినా ఆ తర్వాత ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించడం న్యాయం కాదని ఆమె వాదించారు.

ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీకి హైకోర్టు నోటీసులు

ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీకి హైకోర్టు నోటీసులు

నోటాపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలైంది. ఈ ప్రజాప్రయోజన వాజ్యంలో పిటిషనర్‌.. తాజాగా ఏపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్ధి ఉన్నారన్న కారణంతో నోటా వాడకుండా ఏకగ్రీవంగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. చిత్తూరు పీపుల్స్ యాక్షన్‌ కమిటీ తరఫున దాఖలైన ఈ పిటిషన్‌ను విచారించిన సీజే జస్టిస్‌ అరూప్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేసింది. ఓటరు పాల్గొనకుండా ఏకగ్రీవ ఎన్నికలను ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.

English summary
supreme court on monday seek opinion of central govt and central election commission over cancellation of election if nota got highest votes. anothe side a petition filed in ap high court over seeking usage of nota eventhough one candidate in fray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X