వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహదారి భద్రతపై పీఐబీ వీడియో: ప్రధాని మోడీ కారులో సీటు బెల్టు ధరిస్తారు..మరీ మీ సంగతేంటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ తన కారులో కూర్చున్నప్పుడు ముందుగా సీటుబెల్టును ధరిస్తారు. ఇలా మోడీ కారులో కూర్చుని సీటుబెల్టు ధరించే వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ వీడియో విడదుల చేసింది. ఈ వీడియోను రోడ్డు భద్రత గురించి చెప్పేందుకు విడుదల చేసింది. అంతేకాదు వీడియోను షేర్ చేస్తూ ఓ ప్రశ్న కూడా సంధించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. "కారులో కూర్చోగానే ప్రధాని మోడీ ముందుగా సీటు బెల్టు ధరిస్తారు... మరి మీరు దీన్ని ఎలా చూస్తారు?" అనేది ప్రశ్న.

మోడీ తన సీటులో కూర్చొని సీటు బెల్టు ధరించి చేయి ఊపడం కూడా వీడియోలో కనిపిస్తుంది. "సీటు బెల్టు ధరించండి" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్టు చేశారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ఈ వీడియోను కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేసింది. మొత్తానికి రహదారి భద్రతపై ప్రధాని మోడీ వీడియోను పోస్టు చేసి పౌరుల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న రహదారి మరియు రవాణా శాఖ మంత్రిత్వ శాఖను పలువురు అభినందిస్తున్నారు.

If PM Modi can wear the seat belt, then what is your excuse

ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందని.. కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు ధరించడం, బైకుపై వెళ్లే సమయంలో హెల్మెట్ ధరించడంలాంటివి చేయడంతో చేస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. అంతేకాదు మితిమీరిన వేగంతో వాహనం నడపితే.. మద్యం సేవించి వాహనం నడిపితే మన ప్రాణం మనమే తీసుకున్నట్లు అవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందాం. మన కుటుంబ సభ్యులకు అండగా నిలబడదాం. వారికి భరోసాను ఇద్దాం.

English summary
What is the first thing that Prime Minister Narendra Modi do when he gets into the car? He wears the seat belt.The Press Information Bureau (PIB) has shared an inspiring video of the PM wearing his seat belt the moment he gets into the car. The video was shared with an objective of promoting road safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X