వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కశ్మీర్‌కు టూరిస్ట్‌గా వెళ్లాలను కుంటే ఏర్పాట్లు చేస్తాం ,శివసేన ఎంపీ

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ అనుబంధ పార్టీ అయిన శివసేన ఎంపీ సంజయ్ రావత్. రాహుల్ గాంధీ పార్టీ కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అంచన వేయడం కాకుండా టూరు కోసం వెళ్లాలనుకుంటే పూర్తి ఏర్పాట్లు టూరీజం డిపార్టుమెంట్‌లో చెప్పి చేస్తామని ఆయన ఎద్దెవా చేశారు.

జమ్ము కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులను అంచన వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రతిపక్ష పార్టీలతో కలిసి కశ్మీర్ వెళ్లిన విషయం తెలిసిందే..దీంతో ఆయన పర్యటనను అడ్డుకున్న శ్రీనగర్ పోలీసులు తిరిగి వెనక్కి పంపారు. దీంతో ఆయన వివాదాలు సృష్టించడం కోసమే కశ్మీర్ పర్యటనకు వెళ్లారని గవర్నర్ సత్యపాల్ మాలిక్ సైతం విమర్శించారు. ప్రతిపక్షాలతో కాకుండా ఒక్కడు వస్తే అనుమతించేవారమని అన్నారు.

If Rahul Gandhi wants to visit Jammu and Kashmir for touring we will make all the arrangements

మొత్తం జమ్ము కశ్మీర్ అంశంలో ప్రతిపక్షాలను ఒక్క అడుగు కూడ ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున బద్రత చర్యలు చేపట్టిన పోలీసులు రాష్ట్రేతరులను ఎవ్వరిని అడుగుపెట్టనివ్వడం లేదు. మరోవైపు స్థానిక రాజకీయ నాయకులను సైతం గృహ నిర్భంధం చేశారు.

దీంతో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు శనివారం రాహుల్ గాంధీ నాయకత్వంలో పదిపార్టీల ప్రతిపక్షాల నేతలు శ్రీనగర్ వెళ్లారు. దీంతో వారిని నగరంలోకి వెళ్లనీయకుండా పోలీసులు తిప్పిపంపారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు టూర్‌కు వెళ్లినట్టు వెళ్లారని శివసేన ఎంపీ సంజయ్ రావత్ విమర్శలు చేశారు.

English summary
If Rahul Gandhi wants to visit Jammu and Kashmir for touring and enjoyment then we will request the tourism department to make all the arrangements for those activities, said shivasena mp Sanjay Raut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X