బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి సూర్య‘గ్రహణం’: సీఎంకు షాక్, 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సూర్యగ్రహణం సంభవించక ముందే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు పెద్ద తలనొప్పి పట్టుకుంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన నేతలు ఇప్పుడు యడియూరప్ప ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్ లో అధికారానికి దూరం అయిన బీజేపీకి కర్ణాటకలో ఊహించని ఎదురెబ్బ తగలనుంది. కర్ణాటకలో వాల్మీకీ వర్గానికి చెందిన 15 మంది శాసన సభ్యులు అందరూ సామూహిక రాజీనామాలు చేస్తామని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వాన్ని బహిరంగంగా హెచ్చరించారు.

ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!

 వాల్మీకీ మఠాధిపతి అసహనం

వాల్మీకీ మఠాధిపతి అసహనం

వాల్మీకీ కులానికి చెందిన మఠాధిపతి శ్రీ ప్రసన్నానంద స్వామీజీ ఇటీవల బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం మీద బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వాల్మీకీ కులానికి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని, అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని పక్కన పెట్టారని వాల్మీకీ మఠాధిపతి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

 బళ్లారి శ్రీరాములు డీసీఎం !

బళ్లారి శ్రీరాములు డీసీఎం !

బళ్లారి శ్రీరాములు అయినా సరే, లేదా రమేష్ జారకిహోళి అయినా సరే, ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, వాల్మీకీలకు ఈ ఇద్దరూ రెండు కళ్లు లాంటి వాళ్లని వాల్మీకీ మఠం పీఠాధి పతి శ్రీప్రసన్నానంద స్వామిజీ అన్నారు. వాల్మీకీ మఠాధిపతి శ్రీప్రసన్నానంద స్వామీజీ అసహనం వ్యక్తం చెయ్యడంతో అదే కులానికి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

 మా విషయం తేల్చండి సీఎం గారు !

మా విషయం తేల్చండి సీఎం గారు !

వాల్మీకీ కులం మఠాధిపతి వ్యాఖ్యల తరువాత అదే కులానికి చెందిన సురపుర బీజేపీ ఎమ్మెల్యే నరసింహ నాయక్ అలియాస్ రాజు గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద మండిపడుతున్నారు. మా కులానికి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ అన్నారు. మాకు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని రాజు గౌడ చెప్పారు. అయితే వాల్మీకీ కులానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ సీఎం యడియూరప్పను డిమాండ్ చేశారు.

వాల్మీకీలకు 7.5 శాతం రిజర్వేషన్లు

వాల్మీకీలకు 7.5 శాతం రిజర్వేషన్లు

సూర్యగ్రహణం రావడంతో కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ తేదీ నూతన సంవత్సరంలోకి వెళ్లింది. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. మా కులానికి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, మాకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ సీఎం యడియూరప్పను డిమాండ్ చేశారు.

15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ?

15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ?

వాల్మీకీ కులానికి చెందిన మఠాధిపతి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజు గౌడ మాకు వెంటనే రిజర్వేషన్లు కల్పించి మా కులానికి న్యాయం చెయ్యాలని, లేదంటే మా కులానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు అందరూ సామూహికంగా రాజీనామాలు చేస్తామని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ హెచ్చరించారు. అయితే సీఎం యడియూరప్ప అంతదూరం వెళ్లి సమస్యలు కొని తెచ్చుకుంటారని మేము అనుకోవడం లేదని, మాకు రిజర్వేషన్లు కల్పిస్తారని ఎదురు చూస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
If Reservation Not Given To Valmiki Community 15 MLAs Will Resign Soon in Karnataka: Says BJP MLA Raju Gowda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X