వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ నిరసనకారులు వాళ్లను వాళ్లే కాల్చుకు చచ్చారు.. పోలీసులకు సంబంధంలేదు.. యూపీ సీఎం యోగి

|
Google Oneindia TeluguNews

''ఉపద్రవాన్ని తలపెట్టాలనుకునేవాళ్లు ఉపద్రవానికే బలైపోతారు. ఉత్తరప్రదేశ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా తలెత్తిన హింసలో 22 మంది చనిపోయినమాట వాస్తవం. అయితే ఇందులో పోలీసుల ప్రమేయం లేనేలేదు. నిరసనకారులు తమలోతామే తుపాకులతో కాల్చుకుని చనిపోయారు. అయినా, చావడానికే సిద్ధపడి రోడ్లపైకి వచ్చినవాళ్లు ప్రాణాలతో ఎలా మిగులుతారు?'' అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల మరణాల విషయంలో పోలీసుల స్టేట్‌మెంట్, కోర్టు ఆదేశాలను కూడా ఆయన తప్పుపట్టారు.

అసెంబ్లీలో రచ్చ..

అసెంబ్లీలో రచ్చ..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ గతేడాది డిసెంబర్ 20,21 తేదీల్లో యూపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా యూపీలో భయంకరమైన హింస ప్రజ్వరిల్లడం, పలు చోట్ల పోలీసులే విధ్వంసానికి పాల్పడటం, కాల్పుల్లో 22 మంది ఆందోళనకారులు చనిపోవడం తెలిసిందే. దీనిపై యూపీ అసెంబ్లీలో రచ్చ జరిగింది. పోలీసులు, బీజేపీ నేతల కాల్పుల్లోనే నిరసన కారులు చనిపోయారనే ఆరోపణల నేపథ్యంలో సీఏఏ హింసపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుపట్టడంతో సీఎం యోగి వారికి గట్టిగా సమాధానమిచ్చారు.

వాళ్లలో వాళ్లే కాల్చకుచచ్చారు..

వాళ్లలో వాళ్లే కాల్చకుచచ్చారు..

‘‘కచ్చితంగా విధ్వంసం సృష్టించాలనో, ఎదుటివాడిని చంపేయాలనే ఉద్దేశంతోనే ఒకడు రోడ్డుమీదికొస్తే.. మారణాయుధాలను చూపిస్తూ పోలీసులకే ధమ్కీ ఇస్తే.. అలాంటివాడు బతికే చాన్సే లేదు. అయితేగియితే ఆందోళనకారులైనా చావాలి.. లేదంటే పోలీసులైనా అమరులైపోవాలి... ప్రాణాలు పోవడం మాత్రం పక్కా. సీఏఏ నిరసనకారుల చావులతో పోలీసులకు సంబంధంలేదు. దీనిపై జ్యూడీషియల్ ఎంక్వైరీ అవసరమేలేదు. నిజానికి సీఏఏకు వ్యతిరేకంగా ఊహించనంత పెద్ద కుట్రలు జరిగాయి. ముందు అవేంటో బయటపడాలి'' అని సీఎం యోగి అసెంబ్లీలో అన్నారు.

పోలీసుల ప్రకటనతోనూ విభేదం

పోలీసుల ప్రకటనతోనూ విభేదం

సీఏఏ వ్యతిరేక నిరసనల్లో యూపీ వ్యాప్తంగా 22 మంది చనిపోయారు. వాళ్లంతా బుల్లెట్లు తగలడం వల్లే ప్రాణాలు విడిచారు. కాల్పులతో తమకే సంబంధం లేదని బుకాయించిన పోలీసులు.. బిజ్నూర్ ఘటన(మొహ్మద్ సులేమాన్ మృతి)పై మాత్రం నేరాన్ని అంగీకరించారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతోన్నట్లుగా వెల్లడైన సులేమాని.. పోలీసులపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే అతణ్ని కాల్చిచంపామని బిజ్నూర్ ఎస్పీ సంజీవ్ త్యాగీ అధికారిక ప్రకటన చేశారు. ఈ కేసుపై కోర్టులోనూ విచారణ సాగుతోంది.

హింసపై సర్కారు రిపోర్టు..

హింసపై సర్కారు రిపోర్టు..


సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింసకు సంబంధించి యూపీ సర్కారు సోమవారం అలహాబాద్ హైకోర్టుకు ఒక రిపోర్టు సమర్పించింది. డిసెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన ఘటనల్లో మొత్తం 22 మంది చనిపోయారని, 83 మంది నిరసనకారులు, 455 మంది పోలీసులు గాయపడ్డారని, చనిపోయినవాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసుల తూటాలకు బలైపోయి ఉంటారని, మిగిలిన 20 మంది చావులకు కారణాలు తెలియలేదని యోగి ప్రభుత్వం పేర్కొంది. కోర్టుకు రిపోర్టు పంపిన రెండో రోజే సీఎం యోగి ఆదిత్యనాథ్ విరుద్ధ ప్రకటన చేయడం వివాదాస్పదమైంది.

English summary
In his latest remarks on the agitation against the new citizenship law, Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Wednesday claimed that no trouble-maker died due to police bullet and that they died in firing among themselves
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X