వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులను ఏరివేస్తేనే... పాకిస్థాన్‌తో చర్చలు, పాక్‌కు లేఖ రాసిన మోడీ...!

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదుల ఏరివేతపై పాకిస్థాన్ నిర్మాత్మక చర్యలు తీసుకునే నిబంధనను పాటిస్తేనే ఆదేశంతో చర్చలు ఉంటాయని ప్రధాని నరంద్రమోడీ మరోసారి స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాల మధ్య చర్చల కోసం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖకు బదులిస్తూ మోడీ పై విధంగా పేర్కోన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలు తీసుకునే వరకు ఎలాంటీ చర్చలు ఉండవని అధికారికంగా తెలిపారు.

భారత్‌తో పునర్‌వైభవం కోసం పాక్ తహతహ

భారత్‌తో పునర్‌వైభవం కోసం పాక్ తహతహ

పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.ఉభయ దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇతర పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండు దేశాల మధ్య మైత్రీ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత్‌తో చర్చలు జరపడం వల్లే కశ్మీర్ సమస్యతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ పాక్ ప్రధాని భారత్‌కు లేఖ రాశారు.

బిష్కేక్‌లో పాక్‌ను దగ్గరకు రానివ్వని మోడీ,

బిష్కేక్‌లో పాక్‌ను దగ్గరకు రానివ్వని మోడీ,

ఈనేపథ్యంలోనే బిష్కేక్‌లో నిర్వహించిన ఎస్‌సీఓ సమావేశంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని పాకిస్థాన్ భావించింది. అయితే ప్రధాని మోడీ మాత్రం బిష్కేక్‌లో రష్యా, చైనాలతో పాటు అతిధ్య దేశం కిర్గిస్థాన్‌తో చర్చలు జరిపిన మోడీ పాకిస్థాన్‌తో మాత్రం ఎలాంటీ అధికారిక సమావేశాలు నిర్వహించలేదు..ఇక అంతకుముందు పాకిస్థాన్ తమ దేశం గుండా బిష్కేక్ వేళ్లేందుకు అనుమతిని ఇచ్చినా మోడీ మాత్రం దాన్ని ఉపయోగించుకోలేదు.

భారత్ స్సేహం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు...

భారత్ స్సేహం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు...

అయితే భారత్‌ స్సేహహస్తం కోసం పాకిస్థాన్ ఇంత చేసినా... ప్రధాని మోడీ మాత్రం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు నిరాకరిస్తున్నాడు. ఉగ్రవాదాన్ని రూపుమాపిన తర్వాతే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తామని మోడీ స్సష్టం చేశాడు.

ఈనేపథ్యంలోనే పాకిస్థాన్ భారత్ చర్యలపై ఘాటుగా స్పందించింది. భారత దేశానికి ఎన్నికల హ్యాంగోవర్ ఇంకా దిగలేదని పాకిస్థాన్
విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఖురేషీ భారత్‌పై విమర్శలకు దిగారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాము, భారత్ ఇలాంటీ చర్యలకు పాల్పడితే భారత్ మైత్రీ కోసం వెంపర్లాడేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
Prime Minister Narendra Modi has reiterated that relationship with Pakistan can improve only if the neighbouring country takes decisive steps against terrorism. Responding to a letter by Pakistan Prime Minister Imran Khan, Modi wrote back to him, laying India’s pre-condition for any dialogue in clear terms
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X