వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... మార్పు, చేర్పులు చేసుకొండి. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆఫ్ లైన్‌కు సంబంధించి ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తామని సమాచారం ఇచ్చింది.

ఓటరు గుర్తింపు కార్డులో తప్పులు సవరించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కార్డులో పేరు, తండ్రిపేరు, వయస్సు, పుట్టిన తేదీ, అడ్రస్ తప్పులను సవరించుకోవాలని సూచించింది. సెప్టెంబర్‌లో www.nvsp.in వెబ్ సైట్‌లో లాగిన్ అయి .. మార్పులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే మార్పు చేసే సంబంధిత అంశానికి సంబంధిత ఆధారాలను సమర్పించాలని మెలిక పెట్టింది.

if voter id name wrong.. modify says ec

ఆయా వయోజనుల ప్రతిపాదనలకు సంబంధించి అక్టోబర్ 15న ముసాయిదా విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే నవంబర్ 30 వరకు అబ్జెక్షన్స్ స్వీకరిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించి మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం నవంబర్ 2,3,9,11 తేదీల్లో ప్రత్యేకంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది.

English summary
name on your voter identity card wrong? Do they want to change? But log on to the Election Commission website and make changes and additions. To this end, Easy has revealed the details in a statement. It is suggested to apply online as well as offline. It also informed that special camps will be held in connection with the offline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X