వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చౌకీదార్ నిజాయితీ ఉంటే అప్పీల్ చేయు : సంజౌతా ఎక్స్ ప్రెస్ తీర్పుపై ఓవైసీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం పీక్ స్టేజీకి చేరింది. 'మై బీ చౌకీదార్' నినాదాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటుండగా ... విపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో దేశం నమ్మకమైన ప్రధానమంత్రిని కోరుకుంటుందని ఎంఐఎం పేర్కొంది. చౌకీదార్‌ను కాదని మోదీని ఉద్దేశించి విమర్శించింది.

 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు

నిజాయితీ ఉంటే అప్పీల్ చేయండి

నిజాయితీ ఉంటే అప్పీల్ చేయండి

చౌకీదార్, మోదీకి నీతి, నిజాయితీ ఉంటే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ తీర్పును అప్పీల్ చేయాలని కోరారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైనా అసీమానంద సహా మిగిలినవారు నిర్దోషులని పంచకుల కోర్టు తీర్పునుచ్చింది. నిజంగా మీరు దేశానికి చౌకీదార్ అయితే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబ్ బ్లాస్ట్‌లో నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో అప్పీల్ చేయాలని కోరారు. అసీమానంద్‌ను చూసి మోదీ భయపడుతున్నారని మండిపడ్డారు.

మోదీ హయాంలో దాడులు ?

మోదీ హయాంలో దాడులు ?

దేశంలో నరేంద్రమోదీ హయాంలోనే ఉగ్రదాడులు పెరిగాయన్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్. మోదీ నేతృత్వంలోని కేంద్రం అధికారంలో ఉండగా పఠాన్‌కోట్, యూరి, పుల్వామా దాడులు జరిగాయని గుర్తుచేశారు. మరి మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకమైన కాపాలాదారుడు అని ప్రశ్నించారు. దేశం నమ్మకమైన ప్రధానమంత్రిని కోరుకుంటోంది. కానీ మీ లాంది చౌకీదార్‌ను కాదని విమర్శించారు.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

ఫిబ్రవరి 18, 2007లో హర్యానాలోని పానిపట్‌కు సమీపంలో ఉన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 68 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో అధికంగా పాకిస్తాన్ జాతీయులు ఉండగా భారత రైల్వే అధికారులు నలుగురు మృతి చెందారు. ఓ బోగీలో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అమృత్‌సర్‌లోని అటారీకి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది.

English summary
MIM chief Asaduddin Owaisi has been asked to appeal the Samjhauta Express sentence if Modi is morally upright and honest. The Panchakula court has ruled that the main principal in this case and the others, including Aseemananda, were innocent. You really want to appeal to the court against the accused in the Samjhauta Express bomb blast if you are a ’chowkidar ‘ in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X