డబ్బులుంటే స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయండి, చరిత్ర సృష్టిస్తోంది
న్యూఢిల్లీ:పెద్ద నగదు నోట్లను రద్దు చరిత్ర సృష్టించనుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝన్ వాలా అబిప్రాయపడ్డారు. నిఫ్టీ తిరిగి 50 స్థానాన్ని పునరుద్దరించుకొంటుందన్నారు.ప్రస్తుతం నిఫ్టీ పడిపోవడం తాత్కాలికమేనని చెప్పారు.డబ్బులుంటే ఈక్విటీ మార్కెట్ లో స్టాక్స్ ను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
పెద్ద నగదు నోట్ల రద్దు అనేది స్టాక్ మార్కెట్ ను పునరుజ్జీవం చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నగదు నోట్ల రద్దు షాక్ నుండి మార్కెట్లు త్వరగానే కోలుకొంటాయని చెప్పారు.
పెద్ద నగదు రద్దు అంతర్జాతీయంగా అనుహ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం ద్వారా ఈక్ిటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడం వల్ల కూడ విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయని చెప్పారు.

కానీ పెద్ద నోట్ల రద్దు చరిత్రను సృస్టిస్తోందన్నారు.ఎప్ ఐఐల ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పారు. సానుకూలమైన కేంద్ర బడ్జెట్ మార్కెట్లు పైకి ఎదగడానికి దోహదం చేస్తోందని చెప్పారు
పీఎస్ యూ బ్యాంకుల స్థానాన్ని ప్రైవేట్ రంగ షేర్లు లాగేసుకొంటున్నాయని చెప్పారు. ప్రజలు తాము దాచుకొన్న నగదును బ్యాంకుల్లోకి మార్చుకొనే సమయం వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఫార్మా రంగంలో ఆరేళ్ళుగా కొనుగోలు మద్దతు లభించలేదన్నారు.