గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్సిటీ ర్యాంకింగ్స్: బెంగళూరు ఐఐఎస్‌సీ టాప్, జాబితాలో ఏపీ, టీ వర్సిటీలు

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ యూనివర్శిటీల్లో భారత్‌కు చెందిన 49 వర్శిటీలకు చోటు దక్కింది. భారత్‌ ర్యాంకులను పరిశీలిస్తే ఎప్పటిలాగే వీటిలో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ ఇండోర్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర యూనివర్శిటీలు భారత్‌ నుంచి టాప్‌ 5లో నిలిచాయి.

ఈ జాబితాలో 251వ ర్యాంక్‌తో ఐఐఎస్‌సీ బెంగళూరు భారత యూనివర్శిటీల్లో టాప్‌లో ఉంది. ఆసియా వర్శిటీల పరంగా చూస్తే ఐఐఎస్‌సీ 29వ స్థానంలో నిలిచింది. తొలిసారిగా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఐఐటీ ఇండోర్‌ ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 400లో ఉంది. ఇక గతేడాది టాప్‌ 351-400 ర్యాంకింగ్‌ బ్యాండ్‌లో ఉన్న ఐఐటీ బాంబే ఈ సంవత్సరం 401-500 బ్యాండ్‌కు పడిపోయింది.

IISc Retains Top Indian University Position

ఐఐటీ ఇండోర్‌తో పాటు ఐఐటీ భువనేశ్వర్‌, ఐఐటీ హైదరాబాద్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్చ్‌ పుణె, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, కర్ణాటకలోని శ్రీ శివరాత్రీశ్వర యూనివర్శిటీ ఈ ఏడాది ర్యాంకింగ్‌ జాబితాలో చోటు సాధించాయి.

కాగా, 2018 సంవత్సరానికి గానూ 'టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌' విడుదలయ్యాయి. ఈ జాబితాలో వరుసగా మూడో ఏడాది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ 2, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ మూడో స్థానం దక్కించుకున్నాయి. మొత్తంగా 1200లకు పైగా యూనివర్శిటీలతో జాబితా రూపొందించగా.. భారత్‌ నుంచి 49 విశ్వ విద్యాలయాలు చోటు సాధించాయి.

English summary
Indian Institute of Science (IISc), Bangalore remains in the top most position among Indian Universities and global 251 position in the Times Higher Education World University Ranking 2019. IISc Bangalore, in this year's Asia University ranking was in 29th position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X