వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాన్పూర్‌ ఐఐటీ‌లో దళిత విద్యార్ధి భీమ్‌సింగ్ సూసైడ్, సూసైడ్ నోట్ ఎలా చిరిగింది?

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఐఐటీ కాన్పూర్‌లో దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్న పీహెచ్‌డీ విద్యార్ధి భీమ్‌సింగ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు భీమ్‌సింగ్ సూసైడ్ నోట్ రాశాడు. అయితే ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

హస్టల్‌ రూమ్‌లోనే భీమ్‌సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు సూసైడ్ నోట్ ముక్కలు ముక్కలుగా చింపేసి ఉందన్నారు.దీనిపై పలు అనుమానాలున్నాయని ఆయన చెప్పారు.ఈ సూసైడ్ నోట్ భీమ్‌సింగ్ రాశాడా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నోట్‌ను పంపుతున్నట్టు చెప్పారు.

IIT-Kanpur Student Hung Himself In Hostel, Ripped up Suicide Note Found

ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన సింగ్ తల్లిదండ్రులకు భీమ్‌సింగ్ మరణించిన విషయాన్ని సమాచారం ఇచ్చినట్టు ఎస్పీ అఖిలేష్ కుమార్ చెప్పారు. భీమ్‌సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు.

అయితే సూసైడ్ నోట్‌ ముక్కలు ముక్కలుగా చిరిగి పోయి ఉండడాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భీమ్‌సింగ్ నోట్ రాసి చింపేశాడా, లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సూసైడ్‌ నోట్‌ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

భీమ్‌సింగ్ మృతదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. గురువారం నాడు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌‌లోని నిట్‌లో భీమ్‌సింగ్ బీటెక్ పూర్తి చేశారు. 2015లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ‌లో జాయిన్ అయ్యారు.

English summary
A third year Ph.D student of the Indian Institute of Technology (IIT), Kanpur, allegedly committed suicide on Wednesday, by hanging himself from the ceiling fan in his hostel room. The student has been identified as Bheem Singh, said Senior Superintendent of Police, Akhilesh Kumar. He was last seen on Tuesday, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X