వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలు

ఐఐటీ మద్రాస్ క్యాంపస్ క్యాంపస్‌లో ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఐఐటీ మద్రాస్ క్యాంపస్ క్యాంపస్‌లో ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రముఖ కంపెనీలు రానున్నాయి.

ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో పెద్ద ఎత్తున కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. గతానికి భిన్నంగా ఈ దఫా ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొననున్నాయి.

క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్టయ్యే అభ్యర్థులకు భారీగా వేతనాలు పొందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు టెక్కీలకు మంచి అవకాశాలను అందించే అవకాశం ఉందంటున్నారు.

ఐఐటి చెన్నైలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

ఐఐటి చెన్నైలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

డిసెంబర్‌ 1నుంచి ప్రారంభమయ్యే ఐఐటీ మద్రాస్‌ వార్షిక ప్లేస్‌మెంట్స్‌లో తొలిసారిగా యాపిల్‌, యూఐడీఏఐ వంటి సంస్థలు పాల్గొననున్నాయి.క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లతో ఉన్నత విద్యా సంస్థలు కళకళలాడనున్నాయి.. ఆర్థిక మందగమనం క్రమంగా తొలగిపోతుండటంతో దిగ్గజ కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లతో తాజా నైపుణ్యాలను సమీకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

దిగ్గజ కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలు

దిగ్గజ కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలు

చెన్నై ఐఐటి క్యాంపస్‌లో రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న కంపెనీల్లో దాదాపు 15 శాతం సంస్థలు తొలిసారి ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి.
యూబీఎస్‌ ఏజీ, నాస్డాక్‌ స్టాక్‌ మార్కెట్‌, అల్వారెజ్‌,మర్సాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కంట్రీ గార్డెన్‌,హల్మా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెకిసూ కెమికల్‌ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. మొత్తం 400 జాబ్‌ ప్రొఫైల్స్‌తో 270 కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్‌ చేయించుకున్నాయి.

3.గత ఏడాది 250 కంపెనీలు

3.గత ఏడాది 250 కంపెనీలు

గత ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో 250 కంపెనీలు ఐఐటీ చెన్నై క్యాంపస్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఇక ఈ ఏడాది పార్టిసిపెంట్స్‌లో 43 శాతం రిక్రూటర్స్‌ ఇంజనీరింగ్‌, ఆర్‌అండ్‌డీ నుంచి, 25 శాతం ఫైనాన్స్‌ రంగం, 32 శాతం కంపెనీలు ఐటీ రంగం నుంచి పాల్గొంటున్నాయి.

ఈ ఏడాది నుండి 50 స్టార్టప్ కంపెనీలు

ఈ ఏడాది నుండి 50 స్టార్టప్ కంపెనీలు


2017-18 క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ తొలిదశ డిసెంబర్‌ 1 నుంచి 10 వరకూ జరుగుతుందని ఐఐటీ మద్రాస్‌ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‌ 50 స్టార్టప్‌లకు శ్రీకారం చుట్టనుంది. చెన్నై ఐఐటీ క్యాంపస్‌లో ధిగ్గజ కంపెనీలు రావడంతో విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందంటున్నారు.

English summary
This year's placements at IIT-Madras will see first-time participants like Apple Inc and Unique Identification Authority of India (UIDAI) in the recruitment process that is scheduled to begin on December 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X